RRR వాయిదాతో లాభపడ్డ సినిమాలేవి.. సంక్రాంతికి ఎవరు వస్తున్నారు..?

RRR release postponed | అనుకున్నదే జరిగింది.. లాంఛనం పూర్తయింది.. ట్రిపుల్ ఆర్ సినిమా మరోసారి వాయిదా పడింది. జనవరి 7న ఈ సినిమా విడుదల కావడం లేదు. నిజానికి రెండు మూడు రోజులుగా ఈ సినిమా వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇదే నిజమైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమ సినిమాను విడుదల చేయలేమని.. దయచేసి అర్థం చేసుకోండి.. మరో దారి లేదు.. వీలైతే క్షమించండి అంటూ అభిమానుల గుండెలు పగిలే వార్త చెప్పాడు రాజమౌళి. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో థియేటర్లు సగానికి పైగా మూసేశారు. ఉన్న థియేటర్స్‌లో సగం మాత్రమే ప్రేక్షకులు ఉండాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి.
ఇలాంటి సమయంలో వందల కోట్లు పెట్టి తీసిన సినిమాను విడుదల చేసి రిస్క్ చేయలేమని వెనక్కి వెళ్లిపోయారు ట్రిపుల్ ఆర్ టీం. నిజానికి సంక్రాంతికి రాజమౌళి సినిమా వస్తుందని చాలామంది తమ సినిమాలు వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు చివరి నిమిషంలో తన సినిమా వాయిదా వేసుకున్నాడు జక్కన్న. దాంతో మిగిలిన నిర్మాతలు ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడం లేదు. ఉన్న ఈ కాస్త సమయాన్ని వాడుకొని తమ సినిమాలను విడుదల చేయాలా లేదంటే పరిస్థితులు చక్కబడ్డాక తర్వాత మెల్లగా రావాలా అని ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాను పట్టుబట్టి మరీ జనవరి 12 నుంచి తప్పించారు. ఇప్పుడు ఏ సినిమా కోసమే తన సినిమా పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నాడో.. అది వాయిదా పడింది. ఇది మాత్రమే కాదు.. మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి.. RRR తప్పుకోవడంతో మళ్లీ వెనక్కి వచ్చేస్తాయా..? రాబోయే వారం రోజులు తెలుగు ఇండస్ట్రీలో ఏం జరగబోతుంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి మళ్లీ ప్రీపోన్ అవుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ దీనిపై క్లారిటీ లేదు. ఏదేమైనా ఒక్క సినిమా అందరి ప్లాన్స్ తలకిందులు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RRR | ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ వాయిదా.. కన్ఫార్మ్ చేసిన నిర్మాతలు
న్యూ ఇయర్‌కు షాకిచ్చిన దీప్తి సునయిన.. షణ్ముఖ్‌తో బ్రేకప్
దీపూ నుంచి చివరగా కోరుకునేది అదొక్కటే.. బ్రేకప్‌పై స్పందించిన షణ్ముఖ్
మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్.. భోళా శంకర్ నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

