సంక్రాంతి బరిలో డబ్బింగ్ సినిమాలు.. అందరూ స్టార్ హీరోలే..

Tamil movies for sankranthi | సంక్రాంతికి కేవలం మన సినిమాలు మాత్రమే రావాలని కొన్నేళ్ల కిందట దర్శక నిర్మాతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ అది ఇప్పటికీ అమలు కావడం లేదు. ప్రతి సంవత్సరం డబ్బింగ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా తమిళ సినిమాలు మన పండక్కి వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా రజినీకాంత్ వరుసగా తన సినిమాలను సంక్రాంతి బరిలో ఉంచుతున్నాడు. అయితే ఈసారి ఆయన స్థానాన్ని అజిత్ తీసుకుంటున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న వలిమై సినిమా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సిహెచ్ వినోద్ తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ విలన్‌గా నటించాడు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళంలో ఒకే రోజు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు పోస్టర్ నాగచైతన్య చేతులమీదుగా విడుదలైంది.
మరోవైపు విశాల్ సామాన్యుడు సినిమాతో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శరవణన్ తెరకెక్కించిన ఈ సినిమాపై తమిళనాట మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఓకే బంగారం, మహానటి, కనులు కనులను దోచాయంటే, కురూప్ సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఈసారి సంక్రాంతి బరిలో ఉన్నాడు. ఆయన హీరోగా నటించిన సెల్యూట్ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఇందులో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. ఈ ముగ్గురు స్టార్ హీరోలు తమ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీపైకి దండయాత్రకు వస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pushpa in OTT | RRR డేట్‌ను బ్లాక్ చేసిన పుష్ప.. ఓటీటీలో వచ్చేది అప్పుడే
RGV | కొడాలి నానికి షాకింగ్ కౌంటర్ ఇచ్చిన ఆర్జీవీ.. నెట్టింట వైరలవుతున్న ట్వీట్
బిగ్ బీ అమితాబ్ ఇంట్లో కరోనా కలకలం
షణ్ముఖ్ బాటలోనే సిరి కూడా.. బ్రేకప్ దిశగా అడుగులు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

