RGV | కొడాలి నానికి షాకింగ్ కౌంటర్ ఇచ్చిన ఆర్జీవీ.. నెట్టింట వైరలవుతున్న ట్వీట్
RGV | ఏపీ మంత్రి కొడాలి నానికి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చాడు. ఏపీలో సినిమా టికెట్ల విషయమై కొన్ని రోజులుగా ఆర్జీవీ స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి

ఏపీ మంత్రి కొడాలి నానికి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చాడు. ఏపీలో సినిమా టికెట్ల విషయమై కొన్ని రోజులుగా ఆర్జీవీ స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానికి ఆర్జీవీ కొన్ని ప్రశ్నలు వేశారు. అలాగే పేర్నినాని కూడా ఆర్జీవీని కొన్ని ప్రశ్నలు అడగ్గా.. వాటికి సమాధానాలిస్తూ ఆర్జీవీ మరో ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆర్జీవీ అడిగిన ప్రశ్నలపై ఏపీ మంత్రి కొడాలి నాని కౌంటర్ వేశారు. దీనిపై స్సందించాలని ఆర్జీవీని కొందరు అడుగుతున్నారు. దీనిపై తాజాగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. అదిరిపోయే సమాధానం ఇచ్చారు.
‘‘ఏపీ టికెట్ రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్‌కు సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని.. న్యాచురల్ స్టార్ నాని ఒక్కడే. వాళ్లు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు‘‘ అంటూ బదులిచ్చాడు.
కొన్ని రోజుల క్రితం ఏపీ టికెట్ రేట్ల విషయమై స్పందించిన హీరో నాని.. సినిమా థియేటర్ల కన్నా చిల్లరకొట్టు కౌంటర్ ఎక్కువ ఉండటం కరెక్ట్ కాదు కదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీటిపై స్పందించాలని ఒక మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నానిని కొందరు అడిగారు.
అప్పుడు కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘నాకు పేర్ని నాని మాత్రమే తెలుసు. ఈ నాని ఎవరో తెలీదు’’ అంటూ కౌంటర్ వేశారు. ఇప్పుడు ఆర్జీవీ కూడా అదే కౌంటర్ వేయడంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
A P టికెట్ రేట్ల విషయం లో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ @NameisNani ఒక్కడే ..వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు.
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

