బిగ్ బీ అమితాబ్ ఇంట్లో కరోనా కలకలం
Amitabh Bachchan | బాలీవుడ్ సీనియర్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. ముంబైలోని అమితాబ్ నివాసమైన జల్సాలో పనిచేస్తున్న

ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. ముంబైలోని అమితాబ్ నివాసమైన జల్సాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. సీనియర్ నటుని ఇంట్లో మొత్తం 31 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికి గత ఆదివారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఒకరికి పాజిటివ్ వచ్చింది. మిగిలిన అందరికి నెగెటివ్ వచ్చింది. అయితే అతని వల్ల ఎవరెవరికి వైరస్ సోకిందనే విషయం తెలియాల్సి ఉన్నది.
బిగ్ బీ గతేడాది జూలై 11న కరోనా బారినపడ్డారు. దీంతో ముంబైలోని నానావతి దవాఖానలో చికిత్స తీసుకుని వైరస్ నుంచి క్షేమంగా బయటపడిన విషయం తెలిసిందే. కాగా, అమితాబ్‌ను చివరిసారిగా సిల్వర్ స్క్రీన్‌పై ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించిన చెహ్రే సినిమాలో సందడి చేశాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఝుంద్, బ్రహ్మాస్త్ర, కన్నడ సినిమా బట్టర్ఫ్లై, మేడే, గుడ్‌బై, ఉన్చాయ్ సినిమాలు ఉన్నాయి. అదేవిధంగా తెలుగు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

