Lahari shari | బిగ్ బాస్ బ్యూటీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగార్జున..

Lahari shari | ఇండస్ట్రీలో కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలి అంటే అందరి కంటే ముందు వినిపించే పేరు నాగార్జున ( Nagarjuna Akkineni ). ధైర్యం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. తనకు అనిపించింది అంటే నమ్మకంగా ముందుకు వెళతాడు. కొత్త వారికి అవకాశాలు ఇస్తుంటాడు. ఇప్పుడు కూడా సంక్రాంతి బరిలో అందరూ తప్పుకున్నా కూడా.. ధైర్యంగా బంగార్రాజు ( Bangarraju ) సినిమాను తీసుకొస్తున్నాడు. జనవరి 14న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన బంగార్రాజు సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇందులో నాగ చైతన్య ( naga chaitanya ) హీరోగా నటించాడు.
ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. దీని కోసం ఏకంగా ఒక చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకొని.. అందులోనే ప్రమోషనల్ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు బంగార్రాజు టీం. ఇక్కడే మరోసారి నాగార్జున కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చాడు. సాధారణంగా సినిమా ఇంటర్వ్యూల కోసం తెలుగు ఇండస్ట్రీలో అందరూ సీనియర్ యాంకర్ సుమ వైపు పరుగులు తీస్తారు. ఎందుకంటే ఆమె ఇంటర్వ్యూ చేసింది అంటే అది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అని అందరిలో ఒక నమ్మకం వచ్చేసింది. కానీ నాగార్జున మాత్రం బిగ్ బాస్ బ్యూటీ లహరి షారీకి అవకాశం ఇచ్చాడు.
బిగ్‌బాస్ సీజన్ 5లో లహరి షారీ కూడా ఒక కంటెస్టెంట్. కేవలం మూడు వారాల్లో తను ఎలిమినేట్ అయిపోయింది. అయినా కూడా నాగార్జున దృష్టిలో ఉంది. ఇంకా ఎక్కువ వారాలు ఈమె ఉంటుంది అనుకున్న కూడా అనుకోని విధంగా ఎలిమినేట్ అయిపోయింది లహరి. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కెరీర్ పరంగా కాస్త ఇబ్బందులు పడుతూనే ఉంది. అవకాశాలు ఈమెకు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో తన సినిమా బంగార్రాజు ప్రమోషనల్ ఇంటర్వ్యూ లహరి చేతిలో పెట్టాడు నాగార్జున. దాని వల్ల ఆమె కెరీర్‌కు బాగా హెల్ప్ అవుతుంది. ఒక రోజు మొత్తం నాగార్జున, నాగ చైతన్యతో పాటు ఫ్లైట్‌లో ఉండటం.. ఇంటర్వ్యూ చేయడం తన జీవితంలో మరిచిపోలేని అనుభవం అంటూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది లహరి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bangarraju | బంగార్రాజు సినిమాలో 8 మంది హీరోయిన్లు.. ఎవరెవరంటే..
Bangarraju censor review | బంగార్రాజు సెన్సార్ పూర్తి.. ఫస్ట్ రివ్యూ ఏంటంటే..
ఏపీ టికెట్ల ధరలతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు.. నాగార్జున కీలక వ్యాఖ్యలు..
Lahari Shari | లహరి శారీ స్టన్నింగ్ స్టిల్స్..
lahari shari | ఇంతకీ లహరి షారి ఎవరు.. బిగ్ బాస్‌కు ఎలా వచ్చింది..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

