lahari shari | బిగ్ బాస్ షో ( Bigg boss ) మొదలయిన ప్రతిసారి ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు ప్రేక్షకులు. వచ్చే ఒక్క కంటెస్టెంట్ గురించి ఆరా తీస్తుంటారు. తెలిసిన వాళ్లు అయితే సపోర్ట్ చేస్తారు.. ఒకవేళ తెలియకపోతే ఎవరు వీళ్లు అంటూ గూగుల్ చేస్తారు. ప్రతి సీజన్లో అలా తెలియని కంటెస్టెంట్స్ కొందరు వస్తుంటారు. గత సీజన్ తీసుకుంటే అఖిల్, దివి వాద్యా, సోహెల్, అరియానా బిగ్‌బాస్‌కు వచ్చినప్పుడు ఎవరో తెలియదు.. వచ్చిన తర్వాత అందరికీ తెలిశారు. ఈ సీజన్లో కూడా ఇలాగే తెలియని కంటెస్టెంట్లు వచ్చారు.
సెప్టెంబర్ 5 సాయంత్రం 6 గంటల నుంచి బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్ ( Bigg boss Telugu season 5 ) వైభవంగా మొదలైంది. నాగార్జున డ్యాన్సులతో మొదలైన షో.. ఒక్కొక్క కంటెస్టెంట్ రావడంతో మరింత రసవత్తరంగా మారింది. ఈ సారి చాలా మంది తెలిసిన కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేశారు నిర్వాహకులు. అయితే అందులో లహరి షారీ ( lahari shari ) అనే ఒక అమ్మాయి ఉంది. ఈమె గురించి చాలా మందికి తెలియదు. అసలు ఎవరు ఈ అమ్మాయి.. ఎక్కడినుంచి వచ్చింది అంటూ తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు.
ఈ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ మోడలింగ్ కం జర్నలిజం. యాంకర్‌గా ప్రస్థానం మొదలు పెట్టిన లహరి.. మోడల్‌గా మారి ఆ తర్వాత నటిగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో డాక్టర్ పాత్రలో నటించింది. ఆ తర్వాత సుమంత్ హీరోగా వచ్చిన మళ్లీ రావా, తేజ సజ్జ జాంబి రెడ్డి సినిమాలలో కూడా నటించింది. ఇప్పుడు బిగ్‌బాస్ షో లోకి అడుగుపెట్టింది లహరి. ఇక్కడ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బయటికి వచ్చేటప్పుడు స్టార్ గా రావాలని కలలు కంటుంది లహరి షారి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
MAA: ఆ పదవిని నేను నిర్వర్తించలేను, న్యాయం చేయలేను: బండ్ల గణేష్
ఆ షాట్ తర్వాత బాగా ఏడ్చేశా.. ఎమోషన్ అయిన రాశీ ఖన్నా
Bigg boss 5 telugu | బిగ్ బాస్ హౌస్‌లోకి మొదటి కంటెస్టెంట్ ఎంట్రీ