ఆ షాట్ తర్వాత బాగా ఏడ్చేశా.. ఎమోషన్ అయిన రాశీ ఖన్నా

Rashi Khanna | ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో జోరు మీదున్న హీరోయిన్ రాశీఖన్నా. మనం సినిమాతో తెలుగు తెరపై తళుకున్న మెరిసిన ఈ ఢిల్లీ భామ.. ఊహలు గుసగుసలాడే సినిమాతో యువకుల మతి పోగొట్టేసింది. ఆ తర్వాత రవితేజ, ఎన్టీఆర్, విజయదేవరకొండ వంటి హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఇప్పుడు సత్తా చాటుతోంది రాశీ ఖన్నా. ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగు, తమిళ, మలయాళం కలిపి దాదాపు 10 సినిమాల వరకు ఉన్నాయి. వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న రాశీఖన్నా.. కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన ఇబ్బందుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడంపై తన అనుభవాలను చెప్పుకొచ్చింది.

ఒక సినిమా ఒప్పుకున్నామంటే అందులో ఏ సన్నివేశంలో అయినా నటించాల్సిందేనని.. ఆ తర్వాత బాధపడినా లాభం లేదని అంటోంది రాశీ ఖన్నా. మద్రాస్ కెఫె సినిమా షూటింగ్ సమయంలో తనకు ఈ విషయం అర్థమైందని చెప్పుకొచ్చింది. ఆ సినిమాలో జాన్ అబ్రహం భార్యగా రాశీఖన్నా కనిపించింది. ఆ సినిమాలో జాన్ అబ్రహంతో ఒకటి రెండు రొమాంటిక్ సీన్లలోనూ రాశీఖన్నా నటించింది. అయితే తొలిసారిగా అలాంటి సన్నివేశాలు షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా అనిపించిందని పేర్కొంది. దీంతో ఆ షాట్ అవ్వగానే వ్యానిటీ వ్యాన్‌లోకి వెళ్లిపోయి ఏడ్చేశా అని నాటి సంగతులు గుర్తు చేసుకుంది. ఇలాంటివన్నీ సినిమాల్లో భాగమేనని.. నటనను ఒక ప్రొఫెషన్‌గానే చూడాలి తప్ప పర్సనల్‌గా చూడొద్దని తెలుసుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని చెప్పింది. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వచ్చేప్పటికీ ఇవన్నీ తనకు పూర్తిగా బోధపడ్డాయని పేర్కొంది. దీంతో ఆ సినిమాలో విజయ్ దేవరకొండతో రొమాంటిక్ సీన్లు చేయాల్సి వచ్చినప్పుడు ఏ కంగారు లేకుండా నటించానంటోంది రాశీ ఖన్నా. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కొందరైతే నా పాత్ర విషయంలో విమర్శించినా కూడా పర్సనల్‌గా తీసుకోలేదని చెప్పింది. ఒక్కో సినిమా చేసే కొద్దీ పరిణితి వస్తుందిమోనని అప్పుడు అనిపించిందని చెప్పింది.

ప్లస్ టూలోనే లవ్
ఇదే ఇంటర్వ్యూలో తన కాలేజీ డేస్‌ను కూడా గుర్తు చేసుకుంది రాశీ ఖన్నా. మొదట్నుంచి తాను అల్లరి పిల్లను చెప్పిన రాశీ.. స్నేహితులతో కలిసి ఇరుగు పొరుగు వాళ్లకు వచ్చే లెటర్స్ దొంగిలించి చదివేదాన్ని అని గుర్తు చేసుకుంది. వాటిల్లో లవ్ లెటర్స్ ఉంటే వాటిని స్నేహితుల ముందు ఆసక్తిగా చదువుతూ నవ్వుకునేదాన్ని అని చెప్పింది. ఇక ప్లస్ టూలో తన సీనియర్ ఒక అబ్బాయిని ఇష్టపడ్డానని ఓపెన్ అయింది రాశీఖన్నా. అయితే తనకు సిగ్గు ఎక్కువ అవ్వడంతో తన ప్రేమ విషయాన్ని అతనికి చెప్పలేకపోయానని.. అయినప్పటికీ అతనే తన దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేశాడని చెప్పింది. కానీ రోజులు గడిచేకొద్దీ తమ మధ్య ఉన్నది ప్రేమ కాదు.. కేవలం ఆకర్షణే అని తనకు అర్థమైందని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
MAA: ఆ పదవిని నేను నిర్వర్తించలేను, న్యాయం చేయలేను: బండ్ల గణేష్
యజ్ఞం అసలు హీరో గోపీచంద్ కాదు.. మరి ముందు అనుకున్నది ఎవర్ని..?
సంపాదించినది అప్పులకే సరిపోయింది.. కన్నీరు పెట్టుకున్న రోజా
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
మేము ఐదుగురం కాదు.. ఎనిమిది మంది.. మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

