Bigg boss 5 telugu | బిగ్ బాస్ హౌస్‌లోకి మొదటి కంటెస్టెంట్ ఎంట్రీ

siri hanmanth | తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss Season 5) షో మొదలైంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా ప్రసార కార్యక్రమం ప్రారంభమైంది. బిగ్ బాస్ తాజా సీజన్ లో తొలి కంటెస్టెంట్ గా సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చింది. క్రాక్ సినిమాలోని భూంబద్దలు పాటకు ఇరగదీసే స్టెప్పులేస్తూ సిరి హన్మంత్ (Siri Hanmanth) స్టేజ్‌పైకి రాగా..హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఆమెకు హౌస్‌లోకి స్వాగతం పలికారు.
ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని ‘నాకు నచ్చినవి రెండే రెండు ఒకటి నిద్ర, ఇంకొకటి మొగుడు’ అనే డైలాగ్ ను ఐదు మాడ్యులేషన్స్ లో చెప్పమని సిరి హన్మంత్ కు నాగార్జున సూచించాడు. దీంతో సిరి ఐదు రకాలుగా డైలాగ్ చెప్పి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లింది. ఈ సారి గతంలో కంటే చాలా కొత్తగా, స్పెషల్ గా కనిపిస్తోంది బిగ్ బాస్ ఇల్లు. హాలు, డైనింగ్ టేబుల్, బెడ్ రూమ్, స్విమ్మింగ్ పూల్ సహా ఇతర సౌకర్యాలతో కలర్ ఫుల్ గా కనిపిస్తోంది బిగ్ బాస్ హౌజ్.

ఇక ఈ సారి సీజన్ 5తో ఐదు రెట్ల వినోదాన్ని అందిస్తానంటున్నాడు బిగ్ బాస్. బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్ లోకి వచ్చేసింది. ఇప్పటికే మేకర్స్ సీజన్ 5కి సంబంధించిన కొత్త ప్రోమో విడుదల చేస్తూ ఈ సారి 5 రెట్ల వినోదం, ఎనర్జీ ఉంటాయని చెప్పారు. బిగ్ బాస్ హౌస్ కూడా చూపించడంతో అందరి అంచనాలు మరింత పెంచేశారు మేకర్స్.

సిరి హన్మంత్ ఎవరంటే..?
విశాఖ పట్నంలోని ప్రాంతీయ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పనిచేసింది సిరి హన్మంత్. అక్కడి నుంచి హైదరాబాద్ కు మకాం మార్చి న్యూస్ రీడర్ గా పనిచేసింది. ఆ తర్వాత సీరియల్ నటించే ఆఫర్ రావడంతో కెరీర్ మలుపు తిరిగింది. సిరి హన్మంత్ నటించిన వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ ట్రెండింగ్ లో నిలిచాయి. ఈ న్యూస్ రీడర్ కమ్ యాక్టర్ బిగ్ బాస్ షోతో ఎలా అలరిస్తుందో చూడాలి మరి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!
MAA: ఆ పదవిని నేను నిర్వర్తించలేను, న్యాయం చేయలేను: బండ్ల గణేష్
Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

