Bangarraju | బంగార్రాజు సినిమాలో 8 మంది హీరోయిన్లు.. ఎవరెవరంటే..

Bangarraju movie | తెలుగు ఇండస్ట్రీలో మన్మథుడు అంటే నాగార్జున ఒక్కడే. ఈయన వయసు 60 ఏళ్లు దాటినా ఇప్పటికీ నవ మన్మథుడు. ఆ ఫిజిక్ మెయింటెన్ చేయడంలో నాగార్జున తర్వాతే ఎవరైనా. ఈయన ఎవరో తెలియని ఒక ప్రదేశానికి తీసుకెళ్లి వయసు ఎంత అని అడిగితే కచ్చితంగా 30-35 అని చెబుతారు. ఇప్పటికీ అలాగే ఉన్నాడు నాగార్జున. తాజాగా ఆయన హీరోగా నటించిన బంగార్రాజు సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయన సినిమా సీక్వెల్ కావడంతో ఆ క్రేజ్ బాగా పనికొస్తుంది.
తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న బంగార్రాజు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. పండక్కి పండగ లాంటి సినిమా వస్తుంది అంటున్నారు వాళ్లు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒకరు ఇద్దరు కాదు.. 8 మంది హీరోయిన్లు ఉన్నారు. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో కూడా చాలా మంది హీరోయిన్లున్నారు. అందులో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి మెయిన్ హీరోయిన్స్ కాగా.. అనుష్క శెట్టి, అనసూయ, దీక్ష పంత్, హంసా నందిని కూడా నటించారు. ఇక ఇప్పుడు బంగార్రాజు సినిమాలో కూడా ఏకంగా 8 మంది ముద్దుగుమ్మలు కనిపిస్తున్నారు.
ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి మెయిన్ హీరోయిన్స్ కాగా.. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఐటమ్ సాంగ్ చేసింది. ఇక మీనాక్షి దీక్షిత్, దర్శన బానిక్, వేదిక, దక్ష నాగర్కర్, సిమ్రత్ కౌర్ కూడా నటిస్తున్నారు. ఒకే సినిమాలో ఎనిమిది మంది ముద్దుగుమ్మలు అంటే చిన్న విషయం కాదు.. కానీ నాగార్జునకి మాత్రమే ఇది మామూలు విషయం. గతంలో కింగ్ సినిమాలో ఒక పాట కోసం ఏకంగా ఇండస్ట్రీలో ఉన్న లీడింగ్ హీరోయిన్స్ అందరినీ తీసుకొచ్చాడు నాగార్జున. ఇక ఇప్పుడు బంగార్రాజు సినిమాలో కూడా సందర్భానుసారంగా 8 మంది ముద్దుగుమ్మలు కనిపిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bangarraju censor review | బంగార్రాజు సెన్సార్ పూర్తి.. ఫస్ట్ రివ్యూ ఏంటంటే..
తమిళ హీరోతో ప్రేమలో పడ్డ నిధి అగర్వాల్.. అతని ఇంటికే షిఫ్ట్ అయిన ఇస్మార్ట్ బ్యూటీ !
ఇండస్ట్రీలో కొత్త తరం.. అందాలతో మాయ చేస్తున్న యువ హీరోయిన్లు..
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
ఏపీ టికెట్ల ధరలతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు.. నాగార్జున కీలక వ్యాఖ్యలు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

