తమిళ హీరోతో ప్రేమలో పడ్డ నిధి అగర్వాల్.. అతని ఇంటికే షిఫ్ట్ అయిన ఇస్మార్ట్ బ్యూటీ !

Nidhhi Agerwal in Love with Simbu | యాక్టింగ్ కంటే కూడా గ్లామర్‌తోనే ప్రేక్షకులకు చేరువైంది నిధి అగర్వాల్. తెలుగులో ఈమె నాలుగైదు సినిమాలు చేసినా కూడా ఇస్మార్ట్ శంకర్ మినహా బ్లాక్‌బస్టర్ మాత్రం అందుకోలేకపోయింది. అయినపన్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హరిహర వీరమల్లు సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ప్రస్తుతం ఈ ఇస్మార్ట్ బ్యూటీ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. సినిమా కెరీర్ గురించి పక్కన బెడితే ఇప్పుడు ఈమె గురించి ఒక వార్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈమె ఒక తమిళ హీరోతో ప్రేమలో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి.

మన్మథ, వల్లభ వంటి సినిమాలతో తెలుగులోనూ పాపులారిటీ సంపాదించిన శింబుతో నిధి అగర్వాల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్లో కూడా ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. నయనతార, హన్సికతో లవ్ ట్రాక్ నడిపి విఫలమయ్యాడు శింబు. నయన్‌తో అయితే అతని ప్రేమాయణం పెళ్లి దాకా వెళ్లింది కానీ చివరి నిమిషంలో బ్రేకప్ అయింది. ఆ తర్వాత ఆయన కెరీర్ కూడా దారుణంగా పడిపోయింది. చాలాకాలం పాటు చెప్పుకోదగ్గ హిట్ అందుకోలేకపోయాడు. ఇలాంటి సమయంలో గత ఏడాది వచ్చిన ఈశ్వరన్ సినిమాతో హిట్ కొట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. అయితే ఈశ్వరన్ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అప్పటి నుంచి అంటే రెండేండ్లుగా వీరిద్దరూ చెన్నైలో ఒకే ఇంట్లో ఉంటున్నట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తమ రిలేషన్‌షిప్‌పై అటు నిధి అగర్వాల్.. ఇటు శింబు ఇద్దరూ స్పందించలేదు. అయితే టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో నిధి ప్రేమాయణం నడిపించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ ఆర్మీ.. పవర్‌స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తిన నిధి అగర్వాల్
Nidhi Agarwal | తిరస్కరణలు ఎదుర్కొన్నా : నిధి అగర్వాల్
మెసేజ్ పెట్టడానికి, కాల్ చేసేందుకు ఎవరూ లేరు: నిధి అగర్వాల్
నిధి అగర్వాల్ సోయగం చూడతరమా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

