Nidhi Agarwal | తిరస్కరణలు ఎదుర్కొన్నా : నిధి అగర్వాల్
Nidhi Agarwal | కథానాయికగా తొలి సినిమా అవకాశాన్ని అందుకోవడానికి తాను ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పింది నిధి అగర్వాల్. చాలా ఆడిషన్స్‌కు హాజరై తిరస్కరణలను ఎదుర్కొన్నానని తెలిపింది

కథానాయికగా తొలి సినిమా అవకాశాన్ని అందుకోవడానికి తాను ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పింది నిధి అగర్వాల్. చాలా ఆడిషన్స్‌కు హాజరై తిరస్కరణలను ఎదుర్కొన్నానని తెలిపింది. గ్లామర్ పాత్రలకు ప్రాముఖ్యతనిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ భాషల్లో చక్కటి అవకాశాల్ని దక్కించుకుంటున్నది. మంగళవారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో సరదాగా ముచ్చటించింది నిధి అగర్వాల్. ఆమె మాట్లాడుతూ ‘ఇతరులతో నన్ను నేను ఎప్పుడూ పోల్చుకోను. ప్రతి ఒక్కరి లక్ష్యాలు, వాటి కోసం సాగించే ప్రయాణం వేర్వేరుగా ఉంటాయి. నాలోని శక్తిసామర్థ్యాలేమిటో గ్రహిస్తూ నిరంతరం జీవితంలో ముందుకు సాగడానికే ప్రయత్నిస్తుంటా.
కెరీర్ ఆరంభంలో ఒక్క అవకాశం కోసం ఎన్నో రోజులు ఎదురుచూశా. చాలా ప్రార్ధనలు చేశా. ఫొటోషూట్లు, ఆడిషన్స్‌కు హాజరయ్యా. తిరస్కరణలు ఎదురైనా ఏ రోజూ అధైర్యపడలేదు. హార్డ్‌వర్క్‌తో నా కలను నిజం చేసుకున్నా. కథానాయికగా ఐశ్వర్యరాయ్ నాకు స్ఫూర్తి. అనుష్క, కాజల్ అగర్వాల్‌లను అభిమానిస్తా. శక్తివంతమైన మహిళా ప్రధాన చిత్రాలు చేయాలనుంది. త్వరలో బాలీవుడ్లో కథానాయికగా అరంగేట్రం చేయబోతున్నా. వచ్చే ఏడాది నేను నటించిన మూడు సినిమాలు విడుదలకాబోతుండటం ఆనందంగా ఉంది’ అని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో నిధి అగర్వాల్ ‘హరిహర వీరమల్లు’, ‘హీరో’ సినిమాల్లో కథానాయికగా నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

