ఇండస్ట్రీలో కొత్త తరం.. అందాలతో మాయ చేస్తున్న యువ హీరోయిన్లు..
Young Heroines | ఇండస్ట్రీలో కొత్త నీరు వస్తే పాత నీరు పక్కకు వెళ్లి పోవాల్సిందే. ప్రతి ఏడాది ఇది జరుగుతుంటుంది. కొందరు హీరోయిన్లు కనిపించకుండా దూరం అవుతుంటారు. మరికొందరు కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉంటారు. అయితే ఈసారి సీనియర్ హీరోయిన్లు అలాగే ఉన్నారు. వాళ్లతో పాటు కొత్త హీరోయిన్లు ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నారు.

గత ఏడాది ఉప్పెన సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టి వరుస సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈమె రెండో సినిమా నాని శ్యామ్ సింగరాయ్ కూడా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం బంగార్రాజు సినిమాతో సంక్రాంతికి రానుంది కృతి. ఈమె చేతిలో రామ లింగుస్వామి సినిమా, సుధీర్ బాబు ఈ అమ్మాయి గురించి చెప్పాలితో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి.
ఇక పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చిన కేతిక శర్మ కూడా ఇప్పుడు చిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోతుంది. పైగా ఈ అమ్మాయి అందాల ఆరబోతలో నెక్స్ట్ లెవెల్. అందుకే ఈమె వైపు చూస్తున్నారు యువ హీరోలు. మరోవైపు నేహా శెట్టికి కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. పూరీ జగన్నాథ్ మెహబూబా సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. సందీప్ కిషన్ గల్లీ రౌడీ సినిమాలో నటించింది. తాజాగా డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
కేవలం వీళ్లు మాత్రమే కాదు మరి కొందరు యువ హీరోయిన్లు కూడా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సత్తా చూపిస్తున్నారు. వాళ్ల వైపు దర్శక నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. వీళ్లను తీసుకుంటే సినిమాలో అందాల ఆరబోతతో పాటు రెమ్యునరేషన్ కూడా తక్కువగా ఉంటుంది. వీళ్లంతా 20 నుంచి 40 లక్షల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. కృతి శెట్టి ఇప్పుడు ఒప్పుకుంటున్న సినిమాలకు కోటికి పైగా తీసుకుంటుంది. అందుకే నిర్మాతలు ఎక్కువగా కొత్త హీరోయిన్ల వైపు అడుగులు వేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
2021లో సక్సెస్ ఫుల్ డెబ్యూ చేసిన హీరోలు వీళ్లే..
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
మాకు సినిమా వద్దు.. డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. RRR నిర్మాతకు కొత్త తలనొప్పి..
హీరో నితిన్ భార్యకు కరోనా.. వినూత్నంగా బర్త్డే.. వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

