మాకు సినిమా వద్దు.. డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. RRR నిర్మాతకు కొత్త తలనొప్పి..

RRR Movie | రాజమౌళి సినిమా కోసం నిర్మాతలు మాత్రమే కాదు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగబడతారు. ఆయన చెప్పిన రేటుకు సినిమాలు తీసుకుంటారు. ఎందుకంటే జక్కన్న ట్రాక్ రికార్డ్ అలా ఉంది. మిగిలిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు.. రాజమౌళి సినిమాలు మాత్రం మరో ఎత్తు. ఈయన సినిమాలు ప్రత్యేకం.. వాటి రికార్డులు ప్రత్యేకం. అందుకే రాజమౌళితో మిగిలిన సినిమాలు పోటీ పెట్టుకోరు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఈయన ట్రిపుల్ ఆర్ సినిమాకు చెప్పుకోలేని కష్టాలు వస్తున్నాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ సినిమాకు అనుకోని పోస్ట్‌పోన్ కష్టాలు వెంటాడుతున్నాయి.

ఒకటి కాదు రెండు కాదు.. మూడు సార్లు అనౌన్స్ చేసిన తేదీ కూడా వాయిదా పడింది ట్రిపుల్ ఆర్ సినిమా. మొదటి రెండు సార్లు ఏమో కానీ మూడో సారి మాత్రం ప్రమోషన్స్ గట్టిగా చేసుకుని.. ఈ సారి థియేటర్లలో రావడం పక్కా అని తెలిసిన తర్వాత చివరి నిమిషంలో వాయిదా పడింది. దాంతో డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాతకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఎంత రాజమౌళి సినిమా అయితే మాత్రం ఇన్ని సార్లు వాయిదా పడితే కచ్చితంగా కష్టాలు తప్పవు. తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతూ ఉంటాయి. పైగా ప్రస్తుతం టికెట్ రేట్ల ఇష్యూ కూడా నడుస్తోంది. కరోనా వైరస్ ఎప్పటికి తగ్గుతుందో తెలియదు. పరిస్థితులు మళ్లీ ఎప్పటికి చక్కబడతాయో ఐడియా లేదు. చూసుకుంటే రాబోయే కాలమంతా దారుణంగానే కనిపిస్తోంది. పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తరువాత సినిమాను విడుదల చేస్తే అప్పుడున్న రేట్లకు వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు. ఇలా ఎన్నో అనుమానాలు డిస్ట్రిబ్యూటర్ల మైండ్‌లో ఉన్నాయి. అందుకే మాకు సినిమా వద్దు.. మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి అంటూ డిస్ట్రిబ్యూటర్స్ ట్రిపుల్ ఆర్ సినిమా నిర్మాత డీవీవీ దానయ్యపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ట్రిపుల్ ఆర్ నిర్మాతలకు తలనొప్పులు తప్పవు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సమ్మర్ బరిలో ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RRR కారణంగా ఎన్టీఆర్ ఎంత నష్టపోయాడో తెలుసా..?
ram charan about chiru advice | నాన్న ఏం సలహా ఇచ్చాడో చెప్పిన రాంచరణ్
మలయాళంలో డబ్బింగ్ చెప్పకపోడానికి కారణం అదేనంటున్న తారక్..
RRR వాయిదాతో లాభపడ్డ సినిమాలేవి.. సంక్రాంతికి ఎవరు వస్తున్నారు..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

