Bangarraju censor review | బంగార్రాజు సెన్సార్ పూర్తి.. ఫస్ట్ రివ్యూ ఏంటంటే..

Bangarraju censor review | సంక్రాంతికి ఎదురులేకుండా.. వెనక్కి వెళ్లకుండా వస్తున్న ఒకే ఒక పెద్ద సినిమా బంగార్రాజు. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించాడు. సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుంది. దాంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇందులో నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు. యంగ్ బంగార్రాజు పాత్రలో చైతూ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా తన సినిమాపై నమ్మకంతో విడుదల చేస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే ఏపీలో నైట్ షోస్ రద్దు అయిపోయాయి. కర్ఫ్యూ కూడా మొదలైపోయింది. అయినా కూడా జనవరి 14న బంగార్రాజు థియేటర్స్‌లోకి వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా నిడివి రెండు గంటల 40 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సెన్సార్ బోర్డ్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం బంగార్రాజు సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఎప్పట్లాగే సంక్రాంతి ఎంటర్టైనర్ అని ముద్ర వేసుకొని వస్తున్నాడు బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయనకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పైగా సినిమా కోసం సత్యానంద్ సహా సీనియర్ రైటర్స్ బృందం పని చేసింది. రెండేళ్ల పాటు ప్రీ ప్రొడక్షన్ జరుపుకున్న బంగార్రాజు.. కేవలం 50 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేకుండా సినిమా అంతా సరదాగా సాగిపోతుందని.. సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి సమాచారం వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాగార్జున, నాగ చైతన్య మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ అవుతాయని వాళ్లు చెబుతున్నారు. అలాగే క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ఒక ట్విస్ట్ ఉంటుందని.. అది వర్కౌట్ అయితే సినిమా రేంజ్ మరింత పెరుగుతుందని అందరూ చెబుతున్నారు. మొత్తానికి జనవరి 14న బంగార్రాజు వచ్చేస్తున్నాడు. మరి అంచనాలు ఎంత వరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
తమిళ హీరోతో ప్రేమలో పడ్డ నిధి అగర్వాల్.. అతని ఇంటికే షిఫ్ట్ అయిన ఇస్మార్ట్ బ్యూటీ !
ఏపీ టికెట్ల ధరలతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు.. నాగార్జున కీలక వ్యాఖ్యలు..
నాగార్జునకు అనుకోని వరం.. సోగ్గాడికి మామూలు పండగ కాదుగా..
ఇండస్ట్రీలో కొత్త తరం.. అందాలతో మాయ చేస్తున్న యువ హీరోయిన్లు..
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
Krithi Shetty | క్యూట్ క్యూట్ అందాలతో అలరిస్తున్న కృతి శెట్టి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

