నాగార్జునకు అనుకోని వరం.. సోగ్గాడికి మామూలు పండగ కాదుగా..

Bangarraju movie | నిన్నమొన్నటి వరకు సంక్రాంతి బరిలో చిన్న సినిమా ఏదైనా ఉంది అంటే.. బడ్జెట్ పరంగా చూసుకుంటే అది నాగార్జున హీరోగా నటించిన బంగార్రాజు మాత్రమే. కానీ రెండు రోజుల్లో పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమా ఇదే. 2022 సంక్రాంతికి వస్తాయనుకున్న పెద్ద సినిమాలన్నీ ఒకేసారి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితుల కారణంగా ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది. దానికి ముందే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాను పోస్ట్ పోన్ చేయించారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాదే శ్యామ్ సినిమా కూడా వాయిదా పడే అవకాశం లేకపోలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే జనవరి 14న రాధే శ్యామ్ విడుదల కానుంది. ఇప్పుడు అదే రోజు మరో మూడు నాలుగు చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి. దీన్నిబట్టి ప్రభాస్ సినిమా వాయిదా పడిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ఇదిలా ఉంటే ఈ సారి పండక్కి నాగార్జున మాత్రమే పెద్ద హీరో. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది. ముందు నుంచి తన సినిమాలు పండక్కి తీసుకొస్తానని చెప్పిన నాగార్జున.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా పట్టించుకోకుండా రిస్క్ తీసుకుంటున్నాడు. మీడియం బడ్జెట్ సినిమా కావడం.. ఒకే భాషలో విడుదలవుతున్న సినిమా కావడంతో బంగార్రాజు విషయంలో నాగార్జున పెద్దగా టెన్షన్ పడటం లేదు. ఒకవేళ అప్పటికీ థియేటర్స్లో 50 శాతం ఆక్యుపెన్సీ చేసినా కూడా తన సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాడు ఈయన. పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ప్రేక్షకులకు కూడా బంగార్రాజు మాత్రమే ఆప్షన్ అయ్యాడు. ఇప్పుడు పైగా సోగ్గాడే చిన్నినాయన సినిమాకి ఇది సీక్వెల్ కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. కృతి శెట్టి ఆయనకు జోడీగా నటిస్తోంది. రమ్యకృష్ణ మెయిన్ హీరోయిన్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Krithi Shetty | నవ్వుతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్న కృతి శెట్టి..
తండ్రిని మించిన సోగ్గాడిగా మారిన చైతూ.. ఆకట్టుకుంటున్న బంగార్రాజు టీజర్
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
Shyam singharoy | ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా.. వచ్చేది అప్పుడేనా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

