తండ్రిని మించిన సోగ్గాడిగా మారిన చైతూ.. ఆకట్టుకుంటున్న బంగార్రాజు టీజర్

Bangarraju teaser | అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం బంగార్రాజు. కృతిశెట్టి కథానాయిక. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. న్యూ ఇయర్ కానుకగా బంగార్రాజు సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు.
కొత్త సంవత్సరం కానుకగా విడుదలైన ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. టీజర్ చూస్తుంటే నాగచైతన్యను మించిన సోగ్గాడిగా మారినట్లు తెలుస్తోంది. కృతిశెట్టికి లైన్ వేయడం.. ఆమెను పడగొట్టేందుకు రకరకాలుగా ప్రయత్నించడం ఆసక్తికరంగా ఉంది. నువ్వు ఈ ఊరికే కాదు.. మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి.. దేశానికే సర్పంచ్‌వి కావాలని నాగచైతన్య చెప్పిన డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. ఇక శివాలయంలో ఏదో తప్పు జరుగుతుందని.. దాన్న నాగార్జున ఎలా అడ్డుకున్నాడనేది కూడా ఈ సినిమాలో చూపించినట్లు అర్థమవుతుంది. ఇక అనూప్ రూబెన్స్ సంగీతం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. వాసివాడి తస్సాదియ్యా అని సాగే స్పెషల్ పాటలో నాగార్జున, నాగచైతన్యతో కలిసి జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా చిందేయడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇవన్నీ చూస్తుంటే ఈ సంక్రాంతికి బంగార్రాజు.. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలవడం ఖాయమనిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
న్యూ ఇయర్‌కు షాకిచ్చిన దీప్తి సునయిన.. షణ్ముఖ్‌తో బ్రేకప్
Shyam singharoy | ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా.. వచ్చేది అప్పుడేనా?
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
Krithi Shetty | క్యూట్ క్యూట్ అందాలతో అలరిస్తున్న కృతి శెట్టి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

