Shruti haasan in Mega 154 | శృతి హాసన్ తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ జోరు చూపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఈమె వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. 2021లో శృతి హాసన్ నటించిన క్రాక్, వకీల్ సాబ్ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. వీటి తర్వాత శృతి జోరు మళ్లీ పెరిగింది. దానికి ముందు కొన్ని సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా బ్రేక్ ఇచ్చింది. 2016లో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాలో నటించిన తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. ఇంకా చెప్పాలంటే సినిమాలు కూడా చేయలేదు ఈ ముద్దుగుమ్మ. లవ్ బ్రేకప్ కారణంగా కొన్ని రోజుల పాటు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత మెల్లగా మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేసిన శృతి హాసన్.. తెలుగు ఇండస్ట్రీకి కూడా వచ్చింది.
రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ అదిరిపోయింది. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కూడా మంచి కలెక్షన్స్ తీసుకురావడంతో ఈమె పేరు మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది శృతి హాసన్. సంక్రాంతి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈమెకు మరో సెన్సేషనల్ ఆఫర్ వచ్చింది. చిరంజీవి, బాబీ సినిమాలో శృతి హాసన్‌ను హీరోయిన్గా ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో చిరంజీవి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరో యువ హీరో కూడా ఇందులో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలయ్య సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అందుకే మరోసారి శృతి హాసన్ వైపు అడుగులు వేస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. ఇప్పటికే మెగా కాంపౌండ్ లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో నటించింది శృతి హాసన్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
టాలీవుడ్ టాక్..మేం కూడా వారసులమే అంటున్న కూతుళ్లు..!
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Shruti Haasan | 2020లో శృతిహాసన్ నేర్చుకున్న గొప్ప పాఠం ఇదే
Shruti Haasan: ప్రేమ, పెళ్లిపై నోరు విప్పిన శృతి హాసన్
కమల్, సారిక విడిపోవడంపై కూతురు శ్రుతి ఏమందో తెలుసా?