శృతిహాసన్ (Shruti Haasan) స్టార్ కిడ్ మాత్రమే కాదు టాలెంటెడ్ సింగర్, యాక్టర్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తండ్రి కమల్ హాసన్ (Kamal Haasan) బాటలో పయనిస్తూ తనకంటూ ఆ స్థాయి ప్రత్యేక గుర్తింపు రావడం కోసం పట్టుదలతో శ్రమిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తరచూ ఏదో ఒక స్టిల్ ను షేర్ చేసుకుంటుంది. శృతిహాసన్ కెరీర్ తొలినాళ్లలో మోడలింగ్ (Modeling) మొదలుపెట్టినప్పటి ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.
17 ఏళ్ల ప్రాయంలోనే మోడలింగ్ షురూ చేసింది శృతిహాసన్. నేను ఈ ఫొటోలను గుర్తించినపుడు మైండ్ బ్లోయింగ్ అయింది. 17 ఏళ్ల వయస్సపుడు నా మొట్టమొదటి మోడలింగ్. నేను కొంచెం చెత్తగా, కొంచెం నక్షత్రంగా కనిపిస్తా..కానీ జీవితం అలా కాదు. వివిధ మార్గాల ద్వారా పనిచేయడం, నన్ను మెరుగుపరుచుకోవడమంటే ఇష్టం..అంటూ స్టిల్స్ కు క్యాప్షన్ ఇచ్చింది. కమల్ హాసన్ కూతురిగా మొదట మ్యూజిక్ ఇండస్ట్రీలో కెరీర్ షురూ చేసింది శృతిహాసన్.
ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా నిలిచింది. తెలుగులో గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శృతిహాసన్, మళ్లీ ఈ ఏడాది క్రాక్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. మరోవైపు వకీల్ సాబ్ కూడా మంచి హిట్ గా నిలిచింది.
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్‌తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర