Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర
సినీ స్టార్లకు వీరాభిమానులుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమ అభిమాన హీరో కోసం ఎంత రిస్క్ అయినా చేసేందుకు వెనుకాడరు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని కలిసేందుకు ఆయన అభిమాని ఒకరు 12 రోజులు సైకిల్ యాత్ర చేపట్టాడు.

సినీ స్టార్లకు వీరాభిమానులుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమ అభిమాన హీరో కోసం ఎంత రిస్క్ అయినా చేసేందుకు వెనుకాడరు. తాజాగా టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని కలిసేందుకు ఆయన అభిమాని ఒకరు 12 రోజులు సైకిల్ యాత్ర చేపట్టాడు. సైకిల్ పై తిరుపతిలోని అలిపిరి నుంచి బయలుదేరి 12 రోజులకు హైదరాబాద్ కు చేరుకొని చిరంజీవిని కలిశాడు. ఇక ఊహించని రీతిలో అభిమాని తన శక్తినంతా దారపోసి ఇంత దూరం రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు చిరు. అభిమాని ఎన్ ఈశ్వరయ్యతో మాట్లాడి ఆయనతో ఫొటో దిగాడు చిరంజీవి. ఈశ్వరయ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు.

ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ..అభిమాని ఎన్ ఈశ్వరయ్య (N Eswaraiah) బలుజుపల్లి గ్రామం నుంచి ఆగస్టు 10న బయలు దేరాడు. నా పుట్టినరోజు సందర్భంగా నన్ను కలిసేందుకు ఈశ్వరయ్య అలిపిరి నుంచి సైకిల్ పై హైదరాబాద్ వచ్చాడు. నా ఇష్ట దైవం ఆంజేయ స్వామి దీక్ష తీసుకుని, ఆ స్వామి వారి దీవెనలు నాకు అందించాడు. అభిమానుల ప్రేమానురాగాలు మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయని ఎన్నో సందర్బాల్లో చెప్పాను. మా అభిమానుల కుటుంబసభ్యులు ఎప్పుడూ బాగుండాలని మేం కోరుకుంటామని అన్నారు.

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కలిసే ఏర్పాట్లు చేయాలని ఈశ్వరయ్య కోరగా..ఆ ఏర్పాట్లు చేయించాడు చిరంజీవి. ఇక పవన్ కల్యాణ్ ను సెట్స్ లో కలిసిన తర్వాత ఈశ్వరయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇద్దరినీ కలవడంతో 12 రోజులపాటు నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందనిపించిందని ఈ సందర్భంగా ఈశ్వరయ్య అన్నాడు. మెగా హీరోలను కలవాలన్న తన జీవితకాల కోరిక తీరడంతో..ఆ ఆనందంలో తిరుగు పయనమయ్యాడు ఈశ్వరయ్య.

ఇవికూడా చదవండి..
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

