Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య

అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా నాగార్జున అభిమానులకి వరుస గిఫ్ట్స్ ఇస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం నాగ్ .. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ చిత్రాన్ని చేస్తుండగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రాలు చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా, ఈ సినిమాకు ‘ఘోస్ట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వర్షంలో కత్తి పట్టుకొని ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్ లుక్‌లో నాగార్జున కనిపిస్తున్నారు.
ఇక నాగార్జున లీడ్ రోల్లో నటిస్తున్నమరో చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ చిత్రం సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్‌గా బంగార్రాజు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. నాగ్‌కి జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకి జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు.
భావోద్వేగాలు, కమర్షియల్ మేళవింపుగా..అంచనాలకి తగ్గట్టుగానే రూపొందుతున్నబంగార్రాజు చిత్ర ఫస్ట్ లుక్ కొద్ది సేపటి క్రితం చైతన్య విడుదల చేశారు. ఇందులో నాగార్జున మాత్రమే కనిపిస్తున్నారు. స్వర్గం నుండి దిగుతున్నట్టుగా ఆయన కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం స్వర్గం సెట్స్ వేసినట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చలపతిరావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

