Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్‌తో చెక్ పడ్డట్టేనా ?

సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలకు అడ్డుఅదుపే ఉండదు. నిత్యం కొన్నివేల పుకార్లు హల్ చల్ చేస్తుంటాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్దమో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బిగ్ బాస్ గురించి ఎన్నోపుకార్లు వస్తున్నాయి. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 5ని వచ్చే నెల 5న సాయంత్రం 6 గంటలకు కర్టెన్ రైజర్ ఈవెంట్ తో స్టార్ట్ అవుతుందని ప్రకటించారు. రెగ్యులర్ ఎపిసోడ్స్ సోమవారం నుంచి శుక్రవారం ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు ఈ రియాలిటీ షో ప్రసారం అవుతుందని, నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్స్ శని ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకే ఈ షో మొదలవుతుందని పేర్కొన్నారు.
ఈ అనౌన్స్మెంట్ తర్వాత కొత్త ప్రచారం మొదలైంది. షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ క్వారంటైన్లో ఉండగా, ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందని, దీని వలన షో కొద్ది రోజులు వాయిదా పడనున్నట్టు ప్రచారం జరుగుతుంది. కాని తాజగా బిగ్ బాస్ యాజమాన్యం నాగ్‌కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో సెప్టెంబర్ 5 నుండి షో మొదలు కానున్నట్టు ఉంది.దీంతో ఇప్పటి వరకు వచ్చినవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి.
అయితే ‘బిగ్ బాస్ 5’ రెగ్యులర్ డేస్ లో టైమింగ్స్ గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. రాత్రి 10 గంటల టైమ్ స్లాట్ అంటే చాలా ఆలస్యమని.. ఇది టీఆర్పీ రేటింగ్స్ పై ప్రభావం చూపుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్స్ కు ఇబ్బంది లేనప్పటికీ.. మిగతా రోజుల్లో రేటింగ్స్ కష్టమే అని అంటున్నారు. టైమింగ్స్ చేంజ్ చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

