Shruti Haasan | 2020లో శృతిహాసన్ నేర్చుకున్న గొప్ప పాఠం ఇదే
తెలుగు, తమిళ ప్రాజెక్టులతో తీరిక లేకుండా బిజీగా ఉంది కోలీవుడ్ భామ (Kollywood) శృతిహాసన్. ప్రయోగాత్మక పాత్రలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది శృతిహాసన్ (Shruti Haasan).

తెలుగు, తమిళ ప్రాజెక్టులతో తీరిక లేకుండా బిజీగా ఉంది కోలీవుడ్ భామ (Kollywood) శృతిహాసన్. ప్రయోగాత్మక పాత్రలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది శృతిహాసన్ (Shruti Haasan). వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తోంది. ఈ భామ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఎప్పటికపుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ ను షేర్ చేసుకుంటుంది. శృతిహాసన్ తాజాగా ఓ రహస్యాన్ని అందరితో పంచుకుంది. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటనే కదా మీ డౌటు.
2020 కరోనా ఎఫెక్ట్ తో అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దాదాపు కరోనా ప్రభావంతోనే ముగిసిపోయింది. సామాన్య ప్రజానీకంతోపాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమైపోయారు. మరి గతేడాది శృతిహాసన్ ఏం పాఠాలు నేర్చుకుందో చెప్పింది. 2020లో తన సొంత ఫొటోలు ఎలా తీసుకోవాలో నేర్చుకున్నట్టు త్రోబ్యాక్ మెమొరీని పంచుకుంది. బ్లాక్ నేవీ బ్లూ డ్రెస్, ఫంకీ బ్రేస్ లెట్స్ తో కెమెరాకు పోజులిచ్చిన స్టిల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు కామెంట్ల వర్షం కురిసింది. క్యూట్ నెస్ ఓవర్ లోడ్ అయింది అంటూ ఓ ఫాలోవర్ కామెంట్ పెట్టాడు.
ఈ భామ ఇటీవలే తన కెరీర్ తొలినాళ్లలో 17 ఏండ్ల వయస్సులో తొలిసారి మోడలింగ్ చేసిన స్టిల్స్ ను నెట్టింట్లో పోస్ట్ చేయగా ఇప్పటికే తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం శృతిహాసన్ తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి లాభం చిత్రంలో నటిస్తుండగా సెప్టెంబర్ 9న విడుదల కాబోతుంది. కాగా కన్నడ, తెలుగులో ప్రభాస్ తో కలిసి సలార్ సినిమా చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!
MAA: ఆ పదవిని నేను నిర్వర్తించలేను, న్యాయం చేయలేను: బండ్ల గణేష్
Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

