Shruti Haasan: ప్రేమ, పెళ్లిపై నోరు విప్పిన శృతి హాసన్

కమల్ గారాల పట్టి శృతి హాసన్ కొన్నేళ్ల క్రితం మైఖెల్ కోర్సలేతో ప్రేమయాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినిమాలకు కూడా దూరంగా ఉంది. అతనికి బ్రేకప్ చెప్పాక తిరిగి సినిమాలు మొదలు పెట్టింది.ఇక ప్రస్తుతం ఢీల్లీ బేస్డ్ డూడల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు అర్ధమవుతుంది. వీరిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలు,వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్న నేపథ్యంలో ఇద్దరి రిలేషన్‌పై అనుమానాలు నెలకొన్నాయి.
చాటు మాటు వ్యవహారంపై తాజాగా శృతి స్పందించింది. శంతన్ మంచి స్నేహితుడు. ఇద్దరు అభిరుచులు ఒకటే. కళలు, సంగీతం పట్ల అవగాహన ఉంది. అందుకే అతనితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాను. అన్ని అంశాలలోను నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పుకొచ్చింది శృతి. ఇక పెళ్లి విషయంపై స్పందించిన శృతి హాసన్ ..నాకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడే .. పెళ్లికి ముందే ఆ విషయం మీడియాకి లీక్ చేస్తా అని పేర్కొంది.
ప్రస్తుతం శృతి హాసన్ సలార్ సినిమాతో పాటు కొన్ని కోలీవుడ్ సినిమాలతోనూ బిజీగా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న సలార్‌లో శృతిహాసన్ పాత్ర ఎంతో వైవిధ్యంతో అలరిస్తుందని సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

