Keerthy Suresh |టాలీవుడ్‌ను వదలని కరోనా.. కీర్తి సురేశ్‌కు పాజిటివ్

Keerthy suresh tested covid-19 positive | సినీ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి వెంటాడుతుంది. ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు ఈ వైరస్ బారిన పడ్డారు. మహేశ్ బాబు, త్రిష, తమన్, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేశ్, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, సీనియర్ హీరోయిన్లు శోభన, కుష్బూ, లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ తదితరులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా రేణూ దేశాయ్, అకీరా నందన్ కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం భయాందోళనకు గురవుతుంది. ఈ క్రమంలో మరో హీరోయిన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మహానటి కీర్తి సురేశ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.
— Keerthy Suresh (@KeerthyOfficial) January 11, 2022
నాకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని కీర్తి సురేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. తనను కలిసిన వారందరూ టెస్టులు చేసుకోవాలని సూచించారు. అలాగే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పటికి ఇంకా వ్యాక్సిన్ వేసుకోని వారు టీకాలు తీసుకోవాలని సూచించారు. అయితే కీర్తి సురేశ్‌కు కరోనా సోకిందని తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తొందరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే కీర్తి సురేశ్ ప్రస్తుతం మహేశ్ బాబుతో సర్కారు వారి పాట, చిరంజీవితో భోళా శంకర్ సినిమాల్లో నటిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బాలీవుడ్లో కరోనా బాంబు.. శ్రీదేవి కూతురుకు పాజిటివ్
Renu Deasia | నటి రేణుదేశాయ్, అకీరాకు కరోనా పాజిటివ్
Lata Mangeshkar | లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌కు కరోనా.. ఐసీయూలో చికిత్స
Keerthy Suresh: చెల్లెలు పాత్ర కోసం రెండు కోట్ల రెమ్యునరేషనా..!
Keerthy Suresh | వెరైటీ చీరకట్టులో కీర్తి సురేష్ అదిరిపోయే ఫొటోషూట్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

