ముంబై : బాలీవుడ్లో కరోనా కలకలం కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు మహమ్మారి బారినపడ్డారు. తాజాగా దివంగత నటి శ్రీదేవి, బోనీకపూర్ చిన్నకూతురు, జాన్వీకపూర్ సోదరి ఖుషీకపూర్ కరోనాకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఖుషీకపూర్‌తో పాటు బోనీకపూర్, జాన్వీకపూర్ హోం క్వారంటైన్లో ఉన్నారు.
అయితే, జాన్వీ కపూర్, బోనీకపూర్ సైతం కరోనా పరీక్షలు చేసుకోగా.. వైరస్ వారికి సోకిందా? లేదా? అనే పూర్తిగా వివరాలు తెలియరాలేవు. ఇప్పటికే బోనీకపూర్ తనయుడు అర్జున్ కపూర్‌తో పాటు అన్షులా, రియా కపూర్ సైతం కొవిడ్ బారినపడిన విషయం తెలిసిందే. ఇవాళ లెజెండరీ సింగర్ లతామంగేష్కర్ సైతం కరోనా బారినపడగా.. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.