By Maduri Mattaiah
Sree Harsha Konuganti | శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా రౌడీ బాయ్స్ ( Rowdy boys ). శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలియజేశాడు.
రౌడీ బాయ్స్ కథకు ప్రేమ దేశంతో సంబంధం ఉందా?
సాధారణంగా ప్రతి సినిమాకు ఏదో ఒక దానికి రిలేట్ అవుతుంటుంది. అలాగే రౌడీ బాయ్స్ సినిమాకు ప్రేమదేశం సినిమాకు సంబంధం ఉందని అంటుంటారు. కానీ అది నిజం కాదు. నా జీవితంలో జరిగిన కొన్ని విషయాల ఆధారంగా చేసుకుని సినిమా చేశా. మా కాలేజీలోనే అటు ఇంజనీరింగ్ కాలేజీ.. ఇటు మెడికల్ కాలేజీ ఉండేది. మా కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ను బేస్ చేసుకుని కథ రాస్తే.. అది రాజన్న ( దిల్ రాజు)కు నచ్చింది.
హీరో క్యారెక్టర్ గురించి..
హీరో ఆశిష్ క్యారెక్టరైజేషన్‌ను క్రేజీగా ఉండేలాగానే ప్లాన్ చేసుకున్నాను. దానికి తగ్గట్టే ఇప్పుడు చాలా మంది టాటూ వేసుకుంటున్నారుగా. అలా టాటూస్, హోయిర్ స్టైల్ ప్లాన్ చేసి డిజైన్ చేసుకుని చేశాం.
రౌడీ బాయ్స్ కథ ఎలా వచ్చింది?
‘హుషారు’ సక్సెస్ తర్వాత దిల్ రాజు గారు ఓ రోజు పిలిచి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఏదైనా కథ ఉందా? అన్నారు. ఉంది సార్! అని చెప్పి.. మరుసటి రోజు వెళ్లి కథ చెప్పాను. చెప్పగానే ఆయనకు నచ్చి ఓకే చెప్పారు. ముందు ఇది ఆశిష్‌తో సినిమా చేస్తున్నామని రాజుగారు నాకు చెప్పలేదు. రెండు నెలలు పాటు కథపై కూర్చుని అంతా బాగా వచ్చిందని అనుకున్న తర్వాత రాజుగారు ఆశిష్‌తో సినిమా చేస్తామని అన్నారు. తర్వాత ఆశిష్‌ను కలిసి మాట్లాడాను.
ఎవరి కోసం రౌడీబాయ్స్ కథ రాసుకున్నారు?
కాలేజ్ మూవీ వచ్చి చాలా ఏళ్లు అయ్యింది. కథ రాసుకునేటప్పుడు ఎవరైన యంగ్ హీరో అయితే బావుంటుందని అనుకున్నాం. కానీ ఎవరినీ మైండ్‌లో పెట్టుకుని కథను తయారు చేయలేదు.
సినిమా చేసేటప్పుడు ప్రెషర్గా ఫీలయ్యారా?
ఎలాంటి ప్రెషర్ లేదు. అయితే రాజుగారు ఎక్కువ కేర్ తీసుకున్నారు. దాని వల్ల ప్రెషర్ అనిపించింది. ఫిల్మ్ మేకింగ్‌లో ఎలాంటి ప్రెషర్ లేదు.
ఆశిష్ ఎలా నటించారు?
ఆశిష్ చాలా బాగా యాక్టింగ్, డాన్సులు చేశాడు. ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్లందరూ అదే చెప్పారు. రేపు ప్రేక్షకులు ఏం చెబుతారో చూడాలి. తనకు ఫస్ట్ సినిమా అని అనిపించదు. ఎక్స్‌పీరియెన్స్ ఉన్న యాక్టర్లా నటించాడు.
నైట్ సాంగ్ చేయాలని ఎందుకు అనిపించింది?
ప్రెషర్స్ పార్టీ అనేది ప్రతి కాలేజ్‌లో జరుగుతుంటుంది. నేను చదువుకునే రోజుల్లో చాయ్, సమోసా ఇచ్చేవాళ్లు ఇప్పటికీ అలాగే ఉంది. విదేశాల్లో అయితే ప్రాన్ నైట్ అని ఉంటుంది. అందులో కపుల్స్ వస్తారు. డాన్సులు చేస్తారు. దాన్ని మన దగ్గర చూపెడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో డేట్ నైట్ సాంగ్ ప్లాన్ చేశాం.
టైటిల్ రౌడీ బాయ్స్ అని ఎందుకు పెట్టారు?
ప్రతి పిల్లాడుకి 17-18 ఏళ్ల వయసున్నప్పుడు మెచ్యూరిటీ ఉండదు. అప్పుడు చాలా పనులు చేస్తుంటాం. వైల్డ్‌గా ఉంటాం. తర్వాత ఓ ఏజ్ వచ్చిన తర్వాత ఇన్నీ చేశామా! అనిపిస్తుంది. దాన్ని సినిమాలో చూపించాం. ఆ రౌడీనెస్ను సినిమా చూపించాం కాబట్టి.. రౌడీ బాయ్స్ అనే టైటిల్ పెట్టాం. సినిమా చూస్తే ప్రతి ఒక్కరికీ వారి పాత రోజులు గుర్తుకు వస్తాయి.
అనుపమను ఎందుకు సెలెక్ట్ చేశారు?
హీరోయిన్ కోసం చాలా మందిని ఆడిషన్ చేశాం. కొంత మందిని ఫైనల్ కూడా చేశాం. సినిమాలో హీరో కంటే హీరోయిన్ కాస్త పెద్దది. హీరో ఎంత రఫ్‌గా ఉంటాడో.. హీరోయిన్ అంత మెచ్యూర్డ్‌గా ఉండాలి. తెలుగు వచ్చినవాళ్లు ఉంటే బావుంటుందనిపించి ఆలోచిస్తే.. అనుపమ పరమేశ్వరన్ గుర్తుకు వచ్చింది. అదే సమయంలో లాక్ డౌన్ వల్ల ఆమె ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి, యంగ్ లుక్‌లో చక్కగా కనిపించింది. టెస్ట్ షూట్ చేశాం. బాగా ఉందనిపించడంతో ఆమెను హీరోయిన్గా తీసుకున్నాం.
విక్రమ్ పాత్ర ఎలా ఉంటుంది?
విక్రమ్ కళ్లలో మంచి ఇన్టెన్స్ ఉంటుంది. తన పాత్ర పెద్దగా మాట్లాడదు. కళ్లతో మాట్లాడేలా ఉంటుంది. అందుకని తనను తీసుకున్నాం. తను కూడా ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపిస్తాడు. ప్రతి క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఈ సినిమా బాగా నచ్చుతుంది.
మీ నెక్ట్స్ సినిమా ఏంటి?
నెక్ట్స్ ఇంకా ఏదీ కమిట్ కాలేదు. చర్చలు జరుగుతున్నాయి. రౌడీ బాయ్స్ రిలీజ్ తర్వాత ప్లాన్ చేసుకోవాలి. లాక్ డౌన్ సమయంలో స్క్రిప్ట్స్ రాసుకున్నాను.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Anupama | లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్..
మళ్లీ ప్రేమలో పడ్డ శ్రుతి హాసన్.. తానే ప్రపోజ్ చేశానంటూ ఓపెన్ అయిన నటి
చైతూను మామిడి తోటకు రమ్మంటున్న కృతిశెట్టి.. అదిరిపోయిన బంగార్రాజు టైలర్
Keerthy Suresh |టాలీవుడ్‌ను వదలని కరోనా.. కీర్తి సురేశ్‌కు పాజిటివ…