anupama parameswaran | టాలెంట్ ఉన్నా కొంత మంది హీరోయిన్లకు అదృష్టం ఉండదు. అలాంటి ముద్దుగుమ్మల్లో మొదటి వరుసలో వస్తుంది అనుపమ పరమేశ్వరన్. టాలీవుడ్ కు వచ్చిన కొత్తల్లో వరుస విజయాలు అందుకున్న ఈ కేరళ కుట్టి.. ఆ తర్వాత పూర్తిగా గాడి తప్పింది. దానికితోడు రంగస్థలం సహా మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో నుంచి జారిపోయాయి. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ హోదాకు దూరంగానే ఉంది అనుపమ పరమేశ్వరన్. అన్నింటికీ మించి అందాల ఆరబోతకు దూరంగా ఉండటంతో మిగిలిన హీరోయిన్లు ఆమెను డామినేట్ చేసి ముందుకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడిప్పుడే తన పద్ధతులు మార్చుకుంటుంది ఈ కేరళ కుట్టి. అవకాశాల కోసం అందాల ఆరబోతకు సై అంటుంది. అవకాశం ఇస్తే వెండితెరను వేడిక్కించడానికి సిద్ధమే అంటోంది అనుపమ. ఈ క్రమంలోనే ఇప్పుడు విడుదలైన తాజా ఫోటోలు చూస్తుంటే దర్శక నిర్మాతలతో పాటు అభిమానులు కూడా షాక్ తప్పట్లేదు.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ చూపు తనవైపు తిప్పుకుంటుంది అనుపమ పరమేశ్వరన్. తాజాగా నడుము ఒంపులు చూపిస్తూ ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. అందులో రెండు సినిమాల్లో నిఖిల్ హీరో. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 18 పేజెస్, చందు మొండేటి కార్తికేయ 2, దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ బాయ్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది అనుపమ. ఈ మూడు సినిమాలపైనే ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఆధారపడి ఉంది. ఇవి హిట్ అయితే మరిన్ని అవకాశాలు అనుపమ పరమేశ్వరన్ ముందుకు వస్తాయి. లేదంటే కేవలం ఫోటోషూట్స్ తోనే కాలం గడపాల్సి వస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Anupama Parameswaran | మాస్ లుక్లో అనుపమ పరమేశ్వరన్…
చీర కట్టులో అందాలు ఆరబోస్తున్న కేరళ కుట్టి.. ఫ్యాన్స్ ఫిదా
Anupama Parameswaran| అనుపమ పరమేశ్వరన్ ను హ్యాపీగా ఉంచేది ఏంటంటే..!
అధికారుల తప్పిదం.. మార్క్ షీట్లో అనుపమ ఫోటో
వ్యవసాయం చేస్తున్న త్రివిక్రమ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్