Watch: వాహనం ఆపినందుకు.. ట్రాఫిక్ పోలీస్‌పై జేడీఎస్ నేత దాడి
JDS Leader Attacks Traffic Cop | ట్రాఫిక్ తనిఖీ సందర్భంగా వాహనం ఆపినందుకు జేడీఎస్ నేత రెచ్చిపోయారు. ట్రాఫిక్ పోలీస్‌పై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆ జేడీఎస్ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియలో వైరల్ అయ్యింది.
బెంగళూరు: ట్రాఫిక్ తనిఖీ సందర్భంగా వాహనం ఆపినందుకు జేడీఎస్ నేత రెచ్చిపోయారు. ట్రాఫిక్ పోలీస్‌పై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆ జేడీఎస్ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియలో వైరల్ అయ్యింది. (JDS Leader Attacks Traffic Cop) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. జనతా దళ్ (సెక్యులర్) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజు ఆదివారం తన వాహనంలో వెళ్తుండగా ట్రాఫిక్ పోలీస్ అధికారి అరుణ్ తనిఖీ కోసం ఆపాలని సంకేతం ఇచ్చారు. జేడీఎస్ నేత దీనిపై ఆగ్రహించారు. తన వాహనాన్ని ఎందుకు ఆపారని ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారిని ఆయన ప్రశ్నించారు.
కాగా, వాగ్వాదం పెరుగడంతో జేడీఎస్ నేత మంజు సహనం కోల్పోయారు. అక్కడున్న జనం చూస్తుండగా విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ అరుణ్ యూనిఫామ్ కాలర్ పట్టుకుని ఆయనపై దాడి చేశారు. తన కాలు పైకి ఎత్తి ఆ అధికారిని తన్నడానికి ప్రయత్నించారు. స్థానికులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత ముదరకుండా ఆగిపోయింది.
మరోవైపు ఈ సంఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఆదివారం అర్ధరాత్రి వేళ జేడీఎస్ నేత మంజును అరెస్టు చేశారు. ఈ కేసు విషయంలో ఆయనను పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
The Audacity!
JDS leader, Gottigere Manjanna holds a traffic cop by the collar and then allegedly kicks him in full public view. All this because the cop stopped his car apparently. Case registered. Probe on. pic.twitter.com/gHvMYAgPeK— Deepak Bopanna (@dpkBopanna) August 17, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

