ప్రధాన రహదారులపై పశువుల సంచారం.. పట్టించుకోని సారపాక పంచాయతీ
బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడగా ఉన్న సారపాక మేజర్ పంచాయతీలో ప్రధాన రహదారులు పశువులకు నిలయాలుగా మారాయి. పశువులకు సంబంధించిన యజమానులు వదిలివేయడంతో అవి ప్రధాన రహదారులపై చేరి తిష్ట వేస్తున్నాయని, రాత్రి సమయాల్లో...
బూర్గంపహాడ్, ఆగస్టు 17 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడగా ఉన్న సారపాక మేజర్ పంచాయతీలో ప్రధాన రహదారులు పశువులకు నిలయాలుగా మారాయి. పశువులకు సంబంధించిన యజమానులు వదిలివేయడంతో అవి ప్రధాన రహదారులపై చేరి తిష్ట వేస్తున్నాయని, రాత్రి సమయాల్లో వాహనదారులకు ప్రమాదాలు తప్పడంలేదని అటు వాహనదారులు, ప్రజలు మండిపడుతున్నారు. గోవుల సంచారాన్ని నియంత్రించాలని పంచాయతీలో జరిగిన గ్రామ సభల్లో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో వాహనదారులు రాకపోకలు సాగించే ప్రధాన రహదారులపై పశువులు అడ్డదిడ్డంగా పడుకుని ఉండటంతో ప్రయాణం నరకంగా మారిందని, ఒక్కో సమయంలో |ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. పంచాయతీ సంబంధిత అధికారులు పశువులను రోడ్లపై వదిలే యజమానులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరిగాక చర్యలు తీసుకునే కంటే ముందుగానే స్పందిస్తే బాగుంటుందని ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన రహదారులపై పశువుల సంచారం.. పట్టించుకోని సారపాక పంచాయతీ
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

