కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ ప్రేక్షకుకలి చాలా సుపరిచితం. ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాలలో నటించింది. అనతి కాలంలోనే నటిగా మంచి పేరు సంపాదించుకున్న అనుపమ ప్రస్తుతం తెలుగులో నిఖిల్ సరసన 18 పేజీస్ అనే చిత్రం చేస్తుంది. అలానే తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది.
ఈ మలయాళ అందం సినిమాలతోనే కాదు సోషల్ మీడియా పోస్టులతోను పిచ్చెక్కిస్తుంటుంది. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫొటోలతో పాటు పర్సనల్ ఫొటోలు షేర్ చేస్తూ ఉండే అనుపమ తాజాగా చీరకట్టులో వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. దేవ కన్యలా ఉన్నావని కొందరు కామెంట్ చేస్తుంటే మరి కొందరు దివి నుండి భువికి దిగి వచ్చిన అందాల తారవి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అనుపమ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.