Priyanka Chopra | సోషల్ మీడియా ఖాతాల్లో తన భర్త నిక్‌జోనాస్ పేరు తొలగించడంపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మరోమారు క్లారిటీ ఇచ్చారు. వృత్తిపరమైన కారణాల వల్లే తన భర్త పేరు తొలగిస్తే.. కొందరు సోషల్ మీడియాలో మరోలా చిత్రీకరించారని ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సోషల్ మీడియా వేదికల ఖాతాల్లో నిక్‌జోనాస్ పేరు తొలగించడంతో ప్రియాంక చోప్రా దంపతులు విడాకులు తీసుకున్నారన్న వార్తలొచ్చాయి.
చాలా మంది సోషల్ మీడియాలో తమ జీవితంపై అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇది అంత మంచిది కాదని ప్రియాంక చోప్రా అన్నారు. సోషల్ మీడియా వేదికలపై తాను పంచుకునే ఫోటోలపై ఏదేదో ఊహించుకుంటున్నారని చెప్పారు. ప్రియాంక చోప్రా.. తన సోషల్ మీడియా వేదికల ఖాతాల్లో భర్త నిక్ జొనాస్ పేరు తొలగించడం ఇటీవల హాట్ టాపిక్ అయ్యింది. తర్వాత ఇన్స్టాగ్రామ్ వేదికగా నిక్ జొనాస్ పెట్టిన పోస్ట్‌కు రోమాంటిక్ వ్యాఖ్య చేర్చి క్లారిటీ ఇచ్చారు.