Nidhhi Agerwal | హరిహరవీరమల్లు స్టోరీ లైన్ రివీల్ చేసిన నిధి అగర్వాల్

Nidhhi Agerwal about HariHara Veeramallu | క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం హరిహరవీరమల్లు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి హిస్టారికల్ మూవీ ఇది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్ టీజర్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.

16వ శతాబ్దం నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నాడు. కోహినూర్ వజ్రం దొంగతనం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సుమారు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి? ఎలా ఉండబోతుందనే విషయాలు తెలియకుండా డైరెక్టర్ క్రిష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ నిధి అగర్వాల్ మాత్రం ఈ సినిమా స్టోరీ లైన్‌ను రివీల్ చేసింది.

నిధి అగర్వాల్ నటించిన హీరో సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న వస్తుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిధి అగర్వాల్.. హరిహరవీరమల్లు సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇది పూర్తిగా పీరియాడికల్ సినిమానే అయినా రెండు కాలాల్లో జరిగే కథ అని బయటపెట్టింది. అప్పటి కాలానికి.. ఇప్పటి కాలానికి ముడిపెడుతూ సినిమా ఉండబోతుందని చెప్పింది. నిధి చెప్పిన దాని ప్రకారం హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. మొత్తానికి నిధి అగర్వాల్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
తమిళ హీరోతో ప్రేమలో పడ్డ నిధి అగర్వాల్.. అతని ఇంటికే షిఫ్ట్ అయిన ఇస్మార్ట్ బ్యూటీ !
పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ ఆర్మీ.. పవర్‌స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తిన నిధి అగర్వాల్
Nidhi agarwal | గ్లామర్ హీరోయిన్ అన్న పిలుపు నచ్చలేదు
Nidhhi Agerwal: పచ్చగడ్డిపై పడచుపిల్ల
Nidhi Agarwal | తిరస్కరణలు ఎదుర్కొన్నా : నిధి అగర్వాల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

