పూర్తిస్థాయి యాక్షన్ సినిమా చేయాలన్నది తన కల అని అంటోంది నిధి అగర్వాల్. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘హీరో’. అశోక్ గల్లా హీరోగా నటిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ నెల 15న విడుదలకానుంది. నిధి అగర్వాల్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘కమర్షియల్ పంథాలో విభిన్నంగా సాగే చిత్రమిది. ఇందులో నేను సుబ్బు అనే వైద్యురాలిగా కనిపిస్తా. నా వల్ల ఎదురైన సమస్యను ఓ యువకుడు ఎలా ఛేదించాడన్నది ఆకట్టుకుంటుంది. గతంలో నేను డాక్టర్‌గా నటించిన ‘ఇస్మార్ట్‌శంకర్’తో పాటు మరో తమిళ సినిమా పెద్ద విజయాల్ని సాధించాయి. ఆ సెంటిమెంట్ మరోసారి కలిసి వస్తుందనుకుంటున్నా. అశోక్‌కు ఇదే తొలి సినిమా కావడంతో డ్యాన్సుల విషయంలో నేను కొన్ని సలహాలిచ్చా. పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయాలనే నా కల ‘హరిహరవీరమల్లు’తో నెరవేరింది. గ్లామర్ హీరోయిన్ అనే గుర్తింపును ప్లస్‌గా భావిస్తున్నా. గ్లామర్ అనే పదానికి నా నిర్వచనం వేరు. తొలినాళ్లలో నన్ను అలా పిలవడం నచ్చేదికాదు. ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో డీ గ్లామర్ పాత్ర నటిస్తున్నా. నేను పక్కా హైదరాబాదీని. ఇక్కడే పుట్టా. కథానాయికగా నన్ను తెలుగు ప్రేక్షకులు స్వీకరించడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది.