మోహన్ బాబు రాసిన లేఖ ఎవరిని ఉద్దేశించనది?

Mohan babu | కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. చాలా రోజుల తర్వాత మోహన్‌బాబు నుంచి ఒక లేఖ వచ్చింది. ఇది ఎవరినీ ఉద్దేశించి ఆయన రాశాడు అనేది అర్థం కావడం లేదు. ఇండస్ట్రీ బాగుండాలి అనే ఉద్దేశంతో నేను ఈ లేఖ రాస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో విడుదల చేశాడు ఆయన. మనకెందుకు మనకెందుకు అని మౌనంగా ఉండాలా.. నా మౌనం చేతకానితనం కాదు.. చేవలేనితనం కాదు.. అంటూ లేఖ మొదలుపెట్టాడు మోహన్ బాబు. ఇక్కడే అందరికీ చాలా అనుమానాలు వస్తున్నాయి. మనకెందుకు మనకెందుకు అంటూ ఇండస్ట్రీలో ఎవరున్నారు.. ఆ మాటలు ఎవరన్నారు.. ఉన్నట్టుండి మోహన్ బాబు ఈ లేఖ ఎందుకు విడుదల చేశాడు అంటూ చాలా మంది సినీ ప్రముఖులు చెవులు కొరుక్కుంటున్నారు.
మోహన్ బాబు రాసిన లేఖలో ఇంకా చాలా సంచలన విషయాలు ఉన్నాయి. కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు.. నీ మాటలు నిక్కచ్చిగా ఉంటాయ్.. కఠినంగా ఉంటాయ్…. కానీ నిజాలే ఉంటాయ్. ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది నీకు అవసరమా అన్నారు. అంటే వాళ్లు చెప్పినట్టు బతకాలా… నాకు నచ్చినట్టు బతకాలా.. అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానమే ఇది.. అంటూ లేఖలో కొన్ని విషయాలు చెప్పాడు. అయితే ఈ లేఖలో రాసిన కొన్ని విషయాలు ఆయన చిరంజీవిని టార్గెట్ చేశాడు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అనే విషయం గురించి మీడియాతో కొన్ని గంటల ముందు మాట్లాడాడు. తనకు ఇండస్ట్రీ పెద్ద అవ్వాలని లేదు అంటూ చెప్పాడు. అంతే కాకుండా అనవసరమైన విషయంలో తాను జోక్యం చేసుకోనని కూడా చెప్పాడు మెగాస్టార్. చిరు అలా అన్న తర్వాత మోహన్ బాబు లేఖ విడుదల చేయడం సంచలనంగా మారుతుంది.
సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ కాదు.. కొన్ని వేలమంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు… కొన్ని వేల జీవితాలు… అని లేఖలో చెప్పాడంటే ఆ నలుగురు దర్శకులు, నిర్మాతలు ఎవరు అనేది అర్థం కావడం లేదు. ఇండస్ట్రీలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.. అందరూ సమానం.. ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. చిన్న నిర్మాతల్ని కూడా కలుపుకుని ముఖ్యమంత్రుల దగ్గరకి వెళ్లి సమస్యల్ని వివరిస్తే మనకీరోజు ఇన్ని కష్టాలు వచ్చుండేవి కావు.. అంటూ సీరియస్ అయ్యాడు మోహన్ బాబు. అంతేకాదు సినిమా టికెట్ల విషయంలో కూడా ఈయన స్పందించాడు.
350 రూపాయలు, 300 రూపాయల టికెట్ల రేట్లతో చిన్న సినిమాలు నిలబడ్డం కష్టం. 50 రూపాయలు, 30 రూపాయలు టికెట్ల రేట్లతో పెద్ద సినిమాలు నిలబడ్డం కష్టం.. చిన్న సినిమాలు ఆడాలి.. పెద్ద సినిమాలు ఆడాలి.. దానికి సరైన ధరలుండాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి ‘అయ్యా.. మా సినీ రంగం పరిస్థితి ఇది. చిన్న సినిమాల్ని పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మనకి న్యాయం చేయమని అడుగుదాం. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. మా అందరికీ దేవుళ్లు నిర్మాతలు… కానీ ఈ రోజున ఆ నిర్మాతలు ఏమయ్యారు? అంటూ ఆయన ప్రశ్నించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సినీ ఇండస్ట్రీ పెద్దగా ఉండను.. పెద్దరికంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
Mohanbabu Letter | ‘మనకెందుకు అని మౌనంగా ఉండాలా..?’ మోహన్ బాబు లేఖ వైరల్
అతనితో క్లోజ్‌గా ఎందుకు ఉన్నావన్న నెటిజన్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన ఆమీర్‌ఖాన్ కూతురు
తల్లి కాబోతున్న కాజల్.. ఒక్క ఎమోజీతో క్లారిటీ ఇచ్చిన గౌతమ్ కిచ్లూ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

