Mohanbabu Letter | ‘మనకెందుకు అని మౌనంగా ఉండాలా..?’ మోహన్ బాబు లేఖ వైరల్
సినీ ఇండస్ట్రీ (Cinema Industry)కి తాను పెద్దగా ఉండనని, కానీ బాధ్యతగల బిడ్డగా ఉంటానని చిరంజీవి (Chiranjeevi)చేసిన కామెంట్స్ పై ఇపుడు ఇండస్ట్రీ అంతా తెగ చర్చ నడుస్తోంది. కాగా ఈ నేపథ్యంలో నటుడు మోహన్ బాబు (Mohanbabu) బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

సినీ ఇండస్ట్రీ (Cinema Industry)కి పెద్ద అని అనిపించుకోవడం తనకు ఇబ్బంది అని, పెద్దరికం అనే హోదా తనకిష్టం లేదని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)అన్న మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తాను పెద్దగా ఉండనని, కానీ బాధ్యతగల బిడ్డగా ఉంటానని చిరు చేసిన కామెంట్స్ పై ఇపుడు ఇండస్ట్రీ అంతా తెగ చర్చ నడుస్తోంది. కాగా ఈ నేపథ్యంలో నటుడు మోహన్ బాబు (Mohanbabu) బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
‘మనకెందుకు..మనకెందుకు అని మౌనంగా ఉండాలా..నా మౌనం చేతకాని తనం కాదు..చేవలేని తనం కాదు. కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. నీ మాటలు నిక్కచ్చిగా ఉంటాయ్. కఠినంగా ఉంటాయ్..కానీ నిజాలే ఉంటాయి. ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎందుకు..? ఇది నీకు అవసరమా అన్నారు. అంటే వాళ్లు చెప్పినట్టు బతకాలా..? సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు నిర్మాతలు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదు. కొన్ని వేల మంది ఆశలు. కొన్ని వేల కుటుంబాలు..కొన్ని వేల జీవితాలు. 47 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట ఇది’ అన్నారు.
‘చిన్న సినిమాలు ఆడాలి, పెద్ద సినిమాలు ఆడాలి. సినిమాలు ఆడాలంటే సరైన ధరలుండాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలి. ఇండస్ట్రీకి దేవుళ్లయిన నిర్మాతలు ఇప్పుడెక్కడున్నారు. సినీ పరిశ్రమ ఏ ఒక్కరి గుత్తాదిపత్యం కాదు.
అందరి జీవితాలతో ముడి పడి ఉన్న ఈ సినిమా ఇండస్ట్రీ గురించి, మనుకున్న సమస్యల గురించి సీఎంలకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమై సమస్యలు ఏంటి..పరిష్కారం ఏంటి..ఏది చేస్తే సినీ పరిశ్రమకు మనుగడ ఉంటుందని చర్చించుకోవాలని’ అంటూ మోహన్ బాబు సుదీర్ఘ సందేశంతో రాసిన లేఖ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మరి ఈ లేఖపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.
కలిసి సినిమాని బతికిద్దాం pic.twitter.com/i6Z421REqA
— Mohan Babu M (@themohanbabu) January 2, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

