Aamir khan daughter Ira Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్‌కు వింత అనుభవం ఎదురైంది. తన తండ్రితో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆమెకు నెటిజన్ల నుంచి ఊహించని కామెంట్లు వచ్చాయి. ఒక వ్యక్తి అయితే ఏకంగా.. ఆయనతో ఎందుకు అంత క్లోజ్‌గా ఉన్నావ్.. అతను ఏమైనా నీ బంధువా అంటూ ప్రశ్నించడం ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ కామెంట్లకు విసిగెత్తిపోయిన ఐరా ఖాన్.. వాళ్లందరికీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.
తండ్రి ఆమీర్ ఖాన్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇటీవల ఐరా ఖాన్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇవి సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. ఒక నెటిజన్ ఏకంగా.. ఆయనతో ఎందుకు అంత క్లోజ్‌గా ఉన్నావ్.. అతను ఏమైనా నీ బంధువా అంటూ ప్రశ్నించాడు. దీనికి మరో వ్యక్తి స్పందిస్తూ.. నీకు తెలియదా ఆమె ఆమీర్‌ఖాన్ కూతురు అని రిప్లై ఇచ్చాడు. కానీ మొదటి నెటిజన్ దాన్ని నమ్మలేదు.. అంత యంగ్‌గా ఉన్నాడు. తండ్రిలా కనిపించడం లేదని కామెంట్ చేశాడు. దీనికి మరో నెటిజన్ స్పందిస్తూ ఆమెకు ఆమీర్‌ఖాన్ బయలాజికల్ ఫాదర్ అని బదులిచ్చాడు. దీన్ని కూడా అతను నమ్మలేదు. అలా అయితే షారుఖ్ ఖాన్ నాకు బయోలాజికల్ ఫాదర్ అని కౌంటర్ వేశాడు. ఈ చర్చ అంత చూసిన మరో వ్యక్తి.. డూడ్ ఆమె నిజంగానే ఆమీర్‌ఖాన్ కూతురు.. నమ్మకపోతే గూగుల్‌లో చెక్ చేస్కో అని సమాధానమిచ్చాడు. మధ్యలో మరో యూజర్ కలగజేసుకుని.. గూగుల్‌లో కూడా తప్పులే చూపిస్తాయని కామెంట్ పెట్టాడు. దీనికి మొదటి వ్యక్తి స్పందిస్తూ అవును నిజమే అని అన్నాడు. తన పోస్టుపై జరుగుతున్న చర్చను చూసి ఐరా ఖాన్ చిర్రెత్తుకుపోయింది. దీంతో ఆ చాట్ మొత్తాన్ని స్క్రీన్‌షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ వాళ్లందరికీ దిమ్మతిరిగే కామెంట్ పెట్టింది. ఇది కొత్తది.. కానీ నిజమే.. గూగుల్‌లో వచ్చే ప్రతి దానిని చదివి నిజమని నమ్మకూడదు అని క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
గతేడాది సమంత, నాగచైతన్య కంటే ముందు విడాకులు తీసుకుని షాకిచ్చాడు ఆమీర్‌ఖాన్. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్గా గుర్తింపు పొందిన ఆమీర్‌ఖాన్.. కిరణ్‌రావుతో తన 14 ఏండ్ల వైవాహిక బంధాన్ని తెగదెంపులు చేసుకున్నాడు. ఈ వార్త గతేడాది హాట్ టాపిక్‌గా నిలిచింది. అయితే కిరణ్‌రావు కంటే ముందు రీనా దత్తా నుంచి 2002లో విడాకులు తీసుకున్నాడు ఆమీర్‌ఖాన్.. వీరిద్దరికి కుమార్తె ఐరా ఖాన్, కుమారుడు జునైద్ ఖాన్ ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
2021లో సక్సెస్ ఫుల్ డెబ్యూ చేసిన హీరోలు వీళ్లే..
Samantha item song | టాప్ ఫామ్‌లో ఉన్నపుడే ఐటమ్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే.
వాటిని చూస్తే కాజల్, తమన్నా, ఇలియానాకు భయమట .. ఏంటవి?
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే..
దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామలు
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..