Samantha item song | టాప్ ఫామ్‌లో ఉన్నపుడే ఐటమ్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే.

Samantha item song | ఒకప్పుడు ఐటమ్ సాంగ్ చేయాలంటే ప్రత్యేకంగా ఒక హీరోయిన్ ఉండేది. వాళ్లను ఐటమ్ క్వీన్ అనేవాళ్లు. కానీ రాను రాను కాలం మారిపోయింది. హీరోయిన్స్ కాస్తా ఐటమ్ భామలుగా మారిపోయారు. ముందు ఇది బాలీవుడ్లో మొదలైంది. అక్కడ టాప్ ఫాంలో ఉన్నప్పుడే కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేశారు. దాంతో అప్పటి వరకు చక్రం తిప్పిన మలైకా అరోరా లాంటి హీరోయిన్లకు డిమాండ్ బాగా తగ్గిపోయింది. తెలుగులో ఈ ట్రెండ్ మొదలుపెట్టింది శ్రియ సరన్. వరస సినిమాలు చేస్తున్నప్పుడే ఈమె ఐటమ్ సాంగ్స్ వైపు అడుగులు వేసింది. అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
రామ్ పోతినేని డెబ్యూ మూవీ దేవదాస్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాటకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రజనీకాంత్ శివాజీ చేస్తున్న సమయంలోనే మున్నా, తులసి లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది శ్రియ. ఆ తర్వాత ఈమె బాటలోనే చాలా మంది హీరోయిన్లు నడిచారు. ఇప్పుడు సమంత కూడా తెలుగులో మొదటిసారి స్పెషల్ సాంగ్ చేసింది. పుష్ప సినిమా కోసం చేసిన ఐటమ్ సాంగ్ అదిరిపోయింది. యూట్యూబ్‌లో విడుదలైన క్షణం నుంచి దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు ఈమె కంటే ముందు అల్లుడు శీను, కేజీఎఫ్, జై లవకుశ సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేసి అదరహో అనిపించింది తమన్నా భాటియా. కాజల్ అగర్వాల్ కూడా జనతా గ్యారేజ్‌లో పక్కా లోకల్ అంటూ పిచ్చెక్కించింది. రంగస్థలం సినిమాలో జిగేల్ అందాలతో పూజా హెగ్డే చేసిన ఐటమ్ సాంగ్ ఎవరూ మర్చిపోలేరు.
వీళ్లందరూ కెరీర్ చివర్లో ఉండి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. టాప్ ఫాంలో ఉన్నప్పుడే ఐటమ్ సాంగ్స్ చేశారు. దానికి ప్రత్యేకంగా కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకులు, హీరోలతో ఉన్న ఫ్రెండ్షిప్ ఒక కారణమైతే.. రెమ్యునరేషన్ మరో కారణం. ఒక సినిమా మొత్తం చేసినప్పుడు వచ్చే రెమ్యునరేషన్ ఒక్క ఐటెం సాంగ్‌తోనే సంపాదించవచ్చు. ఇప్పుడు పుష్ప సినిమా కోసం కేవలం ఐదు రోజుల షూటింగ్ చేసి కోటి రూపాయలకు పైగా పారితోషికం అందుకుంది సమంత. అదే మొత్తం సినిమా చేయాలంటే కనీసం 40 రోజులు డేట్స్ ఇవ్వాలి. అప్పుడు వచ్చే పారితోషికం మహా అయితే 2 కోట్లు. పూజా హెగ్డే కూడా రంగస్థలం కోసం దాదాపు 60 లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంది. కాజల్, తమన్నా లాంటి వాళ్లు కూడా ఒక స్పెషల్ సాంగ్ కోసం 40 లక్షలకు పైగానే డిమాండ్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha special song | సమంత ఇకపై వరుసగా ఐటం సాంగ్స్ చేయబోతుందా..?
pushpa censor talk | పుష్ప సెన్సార్ టాక్.. అల్లు అర్జున్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్!
Oo Antava OoOo Antava Song | ఊరమాస్‌గా ‘ఉ అంటావా..ఊ ఊ అంటావా’ సాంగ్
డిసెంబర్ 12న హైదరాబాద్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్..
Allu Arjun: పుష్ప టీమ్ మెంబర్స్‌కి బంగారు రింగ్‌లను బహుమతిగా ఇచ్చి బన్నీ..!
Samantha: బంగార్రాజుపై స్పందించని సమంత.. పుష్ప విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుందిగా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

