By Maduri Mattaiah
pushpa censor talk | అల్లు అర్జున్-సుకుమార్ క్రేజీ కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలు, ట్రైలర్ జనాదరణ పొందాయి.. తాజాగా విడుదలైన సమంత స్పెషల్ సాంగ్ ఉ అంటావా.. ఊహూ అంటావా.. పాట కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. మాస్ యాంగిల్లో ఉన్న సాంగ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ప్రచార చిత్రాల్లో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ లుక్, బాడీలాంగ్వేజ్ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. పీరియాడికల్ డ్రామాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, ఫహద్ పాజిల్ ఇలా అందరికి లుక్స్, పాత్రలు కూడా చాలా విభిన్నంగా ఉండబోతున్నాయి. కాగా ఈ చిత్రం గురువారం సెన్సార్‌ను పూర్తిచేసుకుంది.
యు ఏ సర్టిఫికెట్‌ను పొందిన ఈ చిత్రం 2 గంటల 59 నిమిషాల నిడివితో ఉంటుందట. చిత్రంలోని ప్రతి క్యారెక్టర్ ఎంతో ఆసక్తిగా ఉందని.. చిత్రం ఆద్యంతం ఉత్కంఠగా సాగిందని తెలిసింది. సినిమా మొత్తం మూడు గంటల నిడివి అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉందని.. అల్లు అర్జున్ పాత్ర ఆయన అభినయం సినిమాకు హైలైట్‌గా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా సమంత ఐటెమ్‌సాంగ్ హాట్‌హాట్‌గా కుర్రకారు ఊర్రూతలూగించే విధంగా వుందని, పక్కా మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని తెలిసింది..!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Oo Antava OoOo Antava Song | ఊరమాస్‌గా ‘ఉ అంటావా..ఊ ఊ అంటావా’ సాంగ్
డిసెంబర్ 12న హైదరాబాద్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్..
Allu Arjun: పుష్ప టీమ్ మెంబర్స్‌కి బంగారు రింగ్‌లను బహుమతిగా ఇచ్చి బన్నీ..!
Samantha: బంగార్రాజుపై స్పందించని సమంత.. పుష్ప విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుందిగా..!