టాలీవుడ్ (Tollywood)లో రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తోన్నపుష్ప (Pushpa). రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ (Sukumar) డైరెక్ట్ చేస్తున్నాడు. పుష్పలో స్టార్ హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఉ అంటావా..ఊ ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava) అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ‘కోకా కోకా కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు..పొట్టి పొట్టీ గౌనే వేస్తే పట్టీ పట్టీ చూస్తారు…కోకా కాదు..గౌనూ కాదు..కట్టులోనా ఏముంది..మీ కళ్లలోనే అంతా ఉంది…మీ మగ బుద్దే వంక బుద్దీ..ఉ అంటావా మావ ..ఊ ఊ అంటావా మావ’ అంటూ సాగుతున్న ఈ పాట ఊరమాస్ బీట్తో థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయమని తెలుస్తుంది.
ఈ పాటను ఇంద్రావతి చౌహాన్ పాడింది. ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. డిసెంబర్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
ఇవి కూడా చదవండి..
Bheemla Nayak | ‘భీమ్లానాయక్’లో పాటపాడిన దుర్గవ్వకు సన్మానం
Sara Ali Khan Heartfelt Note | సారా అలీఖాన్ భావోద్వేగ పోస్ట్..కారణమిదే
Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?