Pushpa pre release party | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సంచలన దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్టు పుష్ప. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క ఫోటో, పోస్టర్, టీజర్, ట్రైలర్ అని అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కేవలం తెలుగులో మాత్రమే కాదు మిగిలిన భాషల్లో కూడా పుష్ప సినిమా కంటెంట్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.
ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూ ట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకుంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ దర్శకత్వం ప్రతిభ పుష్ప సినిమా స్థాయిని పెంచేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 12న హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. MAASive Pre Release Event అంటూ పోస్టర్ కూడా విడుదల చేశారు. అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా పుష్ప ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ అందరూ ఈవెంట్లో పాలు పంచుకుంటారు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్‌పై చంద్రబోస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఉ అంటావా.. ఊ అంటావా.. పుష్పలో సమంత సాంగ్ వచ్చేది ఎప్పుడంటే..
Samantha: బంగార్రాజుపై స్పందించని సమంత.. పుష్ప విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుందిగా..!
పుష్ప సినిమాలో అనసూయ సంచలన పాత్ర.. దాక్షాయణి ఎలా ఉండబోతుందంటే..?
Rashmika surprise gift | అల్లు అర్జున్‌కు రష్మిక ఏం గిఫ్ట్ పంపిందో తెలుసా..?