టాలీవుడ్ (Tollywood) స్టార్లు అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రస్తుతం పుష్ప (Pushpa) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇవాళ తన కోస్టార్ అల్లు అర్జున్‌కు సర్ప్రైజ్ కానుక పంపించింది రష్మిక. కొన్ని ఇంట్రెస్టింగ్ వస్తువులను బాక్స్‌లో పెట్టి బన్నీకి పంపించింది. చేతిలో రాసిన నోట్‌ను కూడా పంపించింది.
మీకు ఏదో ఒకటి పంపాలనిపించింది సార్..పుష్ప సినిమా త్వరలో రానున్న నేపథ్యంలో మన టీం అందరికీ ఆల్ ది బెస్ట్.. ప్రేమతో రష్మిక అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్యాప్షన్ ను బట్టి చూస్తే పుష్ప సినిమాలో వినియోగించిన వస్తువులు ఏమైనా అల్లు అర్జున్ కు పంపించి ఉంటుందా..? అని తెగ ఆలోచిస్తున్నారు సినీ జనాలు. రష్మిక పంపించిన బహుమతిని ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు బన్నీ. తనకు గిఫ్ట్ పంపిన రష్మికకు ధన్యవాదాలు తెలియజేశాడు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ముత్తమ్ శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సునీల్ మంగళం శ్రీనుగా కనిపించబోతుండగా..ఇప్పటికే విడుదలైన లుక్ స్టన్నింగ్‌గా ఉంది. మరోవైపు యాంకర్ , నటి అనసూయ దాక్షాయణి పాత్రలో నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. పుష్ప రెండు పార్టులుగా రాబోతుంది.
ఇవి కూడా చదవండి..
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?