కొంతకాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు టాలీవుడ్ (Tollywood) హీరో శర్వానంద్ (Sharwanand). రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్‌జోష్ మీదున్న హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఇపుడీ ఇద్దరి కాంబినేషన్లో ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu) సినిమా వస్తోంది. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ..ఇలా నటించిన సినిమాలన్నీ బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అంతేకాదు హీరోలకు కూడా మంచి సక్సెస్ తెచ్చిపెట్టాయి.
మరి ఫెయిల్యూర్స్ లో ఉన్న శర్వానంద్‌ను రష్మిక గట్టెక్కిస్తుందా..? అంటూ ఇపుడు తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఫాలోవర్లు, పాపులారిటీ విషయంలో రష్మిక టాప్ ప్లేస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ హీరోయిన్ తన సినిమాలో ఉండటం కలిసొస్తుందన్న నమ్మకంతో శర్వానంద్ ఉన్నాడంటూ టాక్ వినిపిస్తోంది. మరి వరుస ప్లాపులతో ఉన్న శర్వానంద్‌ను రష్మిక గట్టెక్కిస్తుందా..? లేదా చూడాలి. ఇటీవలే మహాసముద్రం సినిమాతో మరో ఫెయిల్యూర్ శర్వానంద్ ఖాతాలో పడిపోయింది.
కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఊర్వశి, ఖుష్బూ సుందర్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Ranbir Alia wedding| రణ్‌బీర్‌కపూర్-అలియా పెళ్లిపై తాజా అప్డేట్..!
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్