Jabardasth anchor anasuya | బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తన సత్తా చూపిస్టూ స్టార్ అయిపోయింది జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ఈమె డేట్స్ కోసం పెద్ద పెద్ద నిర్మాతలు కూడా వేచి చూస్తున్నారు. దానికి తోడు చేసే పాత్రల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది అనసూయ. తాజాగా పుష్ప సినిమాలో ఈమె చేయబోయే పాత్ర తెలుగు ఇండస్ట్రీలో ఒక సంచలనమే అవుతుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రకు ప్రాణం పోసిన అనసూయని నమ్మి.. పుష్ప సినిమాలో అత్యంత కీలకమైన దాక్షాయణి పాత్ర ఆమెకు ఇచ్చాడు లెక్కల మాస్టారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సీమ యాస నేర్చుకుంది అనసూయ. ఇందులో సునీల్ భార్యగా జబర్దస్త్ యాంకర్ కనిపిస్తుందనే ప్రచారం జరుగుతుంది.
అనసూయ పాత్ర మరో స్థాయిలో ఉంటుందని.. అల్లు అర్జున్ తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాత్ర అనసూయ సొంతం అని సినిమాకు పని చేసిన వాళ్లే చెబుతున్న మాట. అంతే కాదు ఇందులో మంగళం శ్రీనుగా నటిస్తున్న సునీల్‌ను అనసూయ అత్యంత దారుణంగా చంపేస్తుంది అని తెలుస్తోంది. ఆ సీన్ కూడా ఎవరూ ఊహించని విధంగా సుకుమార్ డిజైన్ చేస్తున్నాడు. ట్రైలర్‌కు ముందు విడుదలైన టీజర్ ఒకసారి పరిశీలించి చూస్తే అది ఎలాంటి సన్నివేశం అనేది అర్థం అవుతుంది. అందులో అనసూయ, సునీల్ ఇద్దరూ ఉన్నారు. ఆ సమయంలోనే అనసూయ నోట్లో బ్లేడ్ కూడా ఉంది. సునీల్‌ను చంపే సీన్ అద్భుతంగా వచ్చిందని.. ఆ సన్నివేశంలో అనసూయ చేసిన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలోని హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తోందని నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి పుష్ప సినిమాతో జబర్దస్త్ యాంకర్ అనసూయ కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rashmika surprise gift | అల్లు అర్జున్‌కు రష్మిక ఏం గిఫ్ట్ పంపిందో తెలుసా..?
Rashmika Preperation | తిరుపతిలోని ఓ గ్రామానికి వెళ్లిన రష్మిక..ఎందుకో తెలుసా..?
jabardasth anchor anasuya | అనసూయ భర్త ఏ జాబ్ చేస్తాడో తెలుసా?
jabardasth anchor Anasuya : గుండు కొట్టించుకుంటానంటున్న అనసూయ.. ఎందుకో తెలుసా?