బుల్లితెరకు గ్లామర్ అద్దిన అందాల ముద్దుగుమ్మ అనసూయ ఇటు యాంకర్‌గాను అటు నటిగాను దూసుకుపోతుంది. ఇక వీలున్నప్పుడల్లా సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో యువత మనసులు దోచుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు ఫ్యామిలీతో షికారుకి కూడా వెళుతుంటుంది. అక్కడి హంగామాను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇస్తుంటుంది. అనసూయ ఇప్పుడు తెలుగులోనే కాదు తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ హీరోయిన్లకు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.
పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైనప్పటికీ అనసూయ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే అనసూయది లవ్ మ్యారేజ్ అనే విషయం అందరికి తెలుసు. కాని ఆమె భర్త ఏ జాబ్ చేస్తాడనే విషయం పెద్దగా తెలియకపోవచ్చు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. తన భర్త ఫైనాన్సర్, ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్ గా చేస్తున్నట్లు పేర్కొంది. తన భర్త సపోర్ట్ వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానంటోంది అనసూయ. నా భర్త నార్త్ ఇండియన్ కాబట్టి, అత్తగారింటికి వెళ్లినప్పుడు తప్పక ఆచారాలను పాటిస్తానని స్పష్టం చేసింది అనసూయ.