అక్టోబర్ 2 వరకు అక్కినేని కోడలిగా ఉన్న సమంత ఆ ఫ్యామిలీ హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్పై తనదైన శైలిలో స్పందించేది. కాని ఎప్పుడైతే చైతూకి డైవర్స్ ఇచ్చినట్టు ప్రకటించిందో ఇక అప్పటి నుండి ఆ ఫ్యామిలీ సినిమాలపై ఏ మాత్రం స్పందించడం లేదు. అక్కినేని నాగార్జున – రమ్యకృష్ణ జంటగా నటించిన చిత్రం “బంగార్రాజు”. ఈ చిత్రంలో తన మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టిలపై చిత్రీకరించిన ఓ పాటను ఇటీవలే రిలీజ్ చేశారు. అంతకముందు నాగార్జున లడ్డుండా అనే సాంగ్స్ రిలీజ్ చేశారు. వీటిపై ఏ మాత్రం స్పందించని అక్కినేని ఇంటి మాజీ కోడలు ఇపుడు ‘పుష్ప’ ట్రైలర్‌పై స్పందించడం విచిత్రంగా మారింది.
తాజాగా పుష్ప మూవీ ట్రైలర్‌పై స్టార్ హీరోయిన్ సమంత స్పందించింది. ‘పుష్ప రాజ్.. తగ్గేదే లే..స అంటూ ఫైర్ ఎమోజీస్‌తో ట్వీట్ చేసింది సామ్. ఈ ట్వీట్‌పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇక ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మరో రెండు రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో పదేళ్ల తర్వాత వస్తున్న చిత్రం ‘పుష్ప: ది రైజ్’. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇప్పటికే విడుదలైన పాటలు, పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లు, మేకింగ్ వీడియో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ‘పుష్ప’ డిసెంబర్ 17న ప్రేక్షకుల మందుకు రానున్నాడు.