Samantha special song | సమంత ఇకపై వరుసగా ఐటం సాంగ్స్ చేయబోతుందా..?

samantha special song oo antava oooo antava in pushpa | అక్కినేని కోడలు పదవి నుంచి తప్పుకున్న తర్వాత సమంత తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా అభిమానులకు ఆమె ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. కానీ సామ్ మాత్రం పక్కా ప్లానింగ్ సిద్ధం చేసుకుంటుంది. స్వేచ్ఛగా తాను చేయాలనుకుంటున్న కథల వైపు అడుగులు వేస్తుంది సమంత. ఈ క్రమంలోనే తెలుగు, తమిళంలో వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. అన్నింటి కంటే ముఖ్యంగా కెరీర్లో మొదటి సారి ఐటమ్ సాంగ్ చేసింది.
సమంత నుంచి స్పెషల్ సాంగ్ ఊహించడం అభిమానులు అసాధ్యం అనుకున్నారు. కానీ పుష్ప సినిమాలో ఉ అంటావా మావ.. ఊఊ అంటావ మావ అంటావ మాస్ డ్యాన్సులతో రెచ్చిపోయింది సమంత. తాజాగా విడుదలైన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ పాడిన ఈ పాటకు గంటల్లోనే మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి. ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మిగిలిన దర్శక నిర్మాతలు ఎందుకు ఊరుకుంటారు. కచ్చితంగా సమంతకు మరిన్ని స్పెషల్ సాంగ్స్ ఆఫర్ చేయడం ఖాయం. సమంత ఒప్పుకుంటుందా అనేది ఇప్పుడు సస్పెన్స్.
సుకుమార్, అల్లు అర్జున్.. ఇద్దరితో సమంతకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. కానీ ఇదే ఆనవాయితీ కొనసాగిస్తుందని మాత్రం అనుమానమే. ఎందుకంటే సమంత వరుస సినిమా ఆఫర్లతో బిజీగా గడిపేస్తోంది. ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్ శాకుంతలం సినిమాతో పాటు శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో యశోద అనే పాన్ ఇండియా సినిమా చేయబోతోంది సమంత. అలాగే తమిళంలో విగ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా చేస్తోంది. దాంతో పాటు డ్రీమ్ వారియర్స్ నిర్మాణంలో మరో సినిమా కమిట్ అయింది సమంత. అన్నింటికీ మించి ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్టు కూడా చేస్తుంది. ఏదేమైనా విడాకుల తర్వాత కెరీర్ గాడి తప్పుతుందేమో.. స్పీడ్ తగ్గుతుందేమో అనుకుంటే మునుపటి కంటే వేగంగా సినిమాలు చేస్తుంది ఈ మాజీ అక్కినేని కోడలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Oo Antava OoOo Antava | పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ పాడింది మంగ్లీ చెల్లెనే.. ఈమె గురించి తెలుసా
pushpa censor talk | పుష్ప సెన్సార్ టాక్.. అల్లు అర్జున్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్!
Oo Antava OoOo Antava Song | ఊరమాస్‌గా ‘ఉ అంటావా..ఊ ఊ అంటావా’ సాంగ్
డిసెంబర్ 12న హైదరాబాద్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్..
Allu Arjun: పుష్ప టీమ్ మెంబర్స్‌కి బంగారు రింగ్‌లను బహుమతిగా ఇచ్చి బన్నీ..!
Samantha: బంగార్రాజుపై స్పందించని సమంత.. పుష్ప విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుందిగా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

