Oo Antava OoOo Antava | పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ పాడింది మంగ్లీ చెల్లెనే.. ఈమె గురించి తెలుసా
Oo Antava OoOo Antava sung by indravathi chauhan | వచ్చేసింది! వచ్చేసింది !! పుష్ప సినిమా నుంచి ఐటెం సాంగ్ వచ్చేసింది. ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ అంటూ సమంత ఐటెం సాంగ్ వచ్చేసింది. అటు సమంత, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సాంగ్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఊరమాస్‌గా ఉన్న సాంగ్ ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తుంది. ముఖ్యంగా ఆ పాట పాడిన సింగర్ వాయిస్ అభిమానుల్ని పిచ్చెక్కిస్తోంది. మరి ఇంతలా ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న ఈ సాంగ్‌ను పాడింది ఎవరో తెలుసా !

నాగ చైతన్యతో విడాకుల తర్వాత వరుస సినిమాలు ఒప్పుకుంటున్న సమంత.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి ఒక స్పెషల్ సాంగ్‌లో సమంత స్టెప్పులేస్తుందని తెలియగానే ఫ్యాన్స్ ఎంతో షాకయ్యారు. ఇప్పటివరకు ఒక్క ఐటెం సాంగ్ కూడా చేయని సమంత.. పుష్పలో స్పెషల్ సాంగ్‌కు ఓకే చెప్పడంతో ఇది ఎలా ఉండబోతుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం ఈ స్పెషల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ అంటూ సాగే ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ మ్యూజిక్కు తగ్గట్టుగానే అల్లు అర్జున్‌తో కలిసి సమంత స్టెప్పులు ఇరగదీసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఊ అంటావా మామ.. ఊఊ అంటావా అనే సాగే ఈ పాటలో సింగర్ వాయిస్ కూడా ఫ్యాన్స్‌ను మైకంలో పడేస్తోంది. మరి ఈ పాట పాడింది ఎవరో తెలుసా !! తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ చెల్లెలు. పేరు ఇంద్రావతి చౌహాన్ ( indravathi chauhan ).

మంగ్లీలాగే ఇంద్రావతి చౌహాన్ కూడా పలు జానపాద పాటలు పాడి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో కోటి జడ్జిగా వచ్చిన బోల్ బేబీ బోల్ రియాలిటీ షోలో కూడా పాల్గొంది. పుష్ప సినిమా కంటే ముందు జార్జి రెడ్డి సినిమాలో కూడా మంగ్లీ చెల్లెలు ఒక పాట పాడింది. జాజిమొగులాలి అనే సాగే ఈ పాట కూడా బాగానే ఉంటుంది. కానీ అంతగా పాపులర్ కాలేదు. కానీ ఇదే సినిమాలో మంగ్లీ పాడిన వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ అనే సాంగ్ మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ పాడే ఛాన్స్ దక్కించుకుంది ఇంద్రావతి చౌహాన్. మత్తెక్కించే వాయిస్‌తో ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ అంటూ ఈమె పాడిన పాట వింటూ ఇప్పుడు యూత్ పిచ్చెక్కిపోతున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే. కన్నడలో ఇదే పాటను మంగ్లీ పాడింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
pushpa censor talk | పుష్ప సెన్సార్ టాక్.. అల్లు అర్జున్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్!
Oo Antava OoOo Antava Song | ఊరమాస్‌గా ‘ఉ అంటావా..ఊ ఊ అంటావా’ సాంగ్
డిసెంబర్ 12న హైదరాబాద్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్..
Allu Arjun: పుష్ప టీమ్ మెంబర్స్‌కి బంగారు రింగ్‌లను బహుమతిగా ఇచ్చి బన్నీ..!
Samantha: బంగార్రాజుపై స్పందించని సమంత.. పుష్ప విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుందిగా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

