రకుల్ ప్రీత్ సింగ్ లుక్‌లో ఈ మధ్య చాలా మార్పులొచ్చాయి. ఇటీవల సన్నగా మారిన పిక్స్‌ను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అందులో రకుల్ మొహం ఇంతకుముందు కంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. ఈ ఫొటోలు చూసిన అందరూ ఇప్పుడు షాకవుతున్నారు. అదేంటి.. రకుల్ ఇలా అయిపోయిందేంటి? ఎలా ఉన్న హీరోయిన్ ఎలా అయిందని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటోలో ఆమె పెదాల్లో కూడా తేడా కనిపిస్తుంది. దీంతో ఆమె పెదవులకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందని.. అది తేడా కొట్టడంతోనే రకుల్ మొహంలో అంతలా మార్పు వచ్చిందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
cosmetic surgery | అందంగా కనిపించేందుకు సినీతారలు కృత్రిమ పద్ధతులను ఫాలో కావడం కొత్తేమీ కాదు. మరింత అందంగా కనిపించాలని కొందరు ముక్కుకు సర్జరీ చేయించుకుంటే.. ఇంకొందరు పెదాలకు ఆపరేషన్లు చేయించుకుంటారు. బాలీవుడ్లో ఎక్కువగా ఉండే ఈ ట్రెండ్‌ను ఇప్పుడు టాలీవుడ్ కూడా ఫాలో అవుతుంది. ఇప్పటికే చాలామంది స్టార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. వీరిలో చాలామంది సర్జరీలు సక్సెస్ అయ్యాయి. అయితే కొంతమందికి ఈ సర్జరీలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం..
అందం అంటే గుర్తొచ్చే పేరు శ్రీదేవి. అతిలోక సుందరిగా పేరుగాంచిన శ్రీదేవి సైతం కృత్రిమ అందం కోసం పాకులాడింది. తన ముక్కుకి నోస్ జాబ్ అనే కాస్మెటిక్ సర్జరీని చేయించుకుని మరింత అందంగా మారింది. పాత సినిమాల్లో శ్రీదేవి లుక్‌కి.. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో ఆమె లుక్‌ను చూస్తే ఈ తేడా మీకే కనిపిస్తుంది.
ఏ మాయ చేశావే సినిమాతో కుర్రకారును ఫిదా చేసిన సమంత కూడా తన ముక్కు, పెదాలకు సర్జరీ చేయించుకుంది. ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా తర్వాత సమంత లుక్‌ను చూసి చాలామంది షాకయ్యారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికంటే అప్పుడే బాగుండే అని సామ్ అభిమానులు చాలామంది అభిప్రాయపడ్డారు.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా అందాన్ని పెంచుకునేందుకు మైనర్ సర్జరీలు చేయించుకుంది. ఆపరేషన్ ద్వారా తన ముఖంలోని పలు లోపాలను సరిచేసుకుంది. తన ముక్కుకు కూడా అమెరికాలో సర్జరీ చేయించుకుంది.
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. రాజా రాణి సినిమా వరకు బొద్దుగా ఉన్న నయన్.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని స్లిమ్‌గా మారింది. శరీరంలో కొవ్వును తగ్గించుకుని అందంగా మారింది. ఇప్పుడు ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. లేడీ ఓరియెంట్ సినిమాలతో దూసుకెళ్తుంది.
కమల్ హాసన్ కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ కూడా కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. తన ముక్కుతో పాటు పెదాలకు సర్జరీ చేయించుకుని అందంగా తయారైంది. తన ప్లాస్టిక్ సర్జరీ గురించి శృతిహాసన్‌నే స్వయంగా వెల్లడించింది. 2009లో లక్ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్. ఈ సినిమా తర్వాత ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె సర్జరీ చేయించుకున్నట్లు టాక్.
అప్పట్లో స్టార్ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న త్రిష కూడా అందంగా కనిపించేందుకు పై పెదవి సర్జరీ చేయించుకుందని పుకార్లు వచ్చాయి. కానీ ఈ విషయంపై త్రిష స్పందించలేదు.
రెండు దశాబ్దాలుగా హీరోయిన్గా అవకాశాలు అందుకుంటున్న నటి శ్రియ. మల్లన్న సినిమాకు ముందు శ్రియ.. తన పెదాలకు సర్జరీ చేయించుకుంది. పై పెదవి విల్లులా కనిపించేలా శ్రియ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది.
అమ్మ నాన్న ఓ తెలుగమ్మాయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆసిన్ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఈమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేముందు తన పెదాలకు సర్జరీ చేయించుకుంది.
అలనాటి నటి రాధ కూతురు కార్తీక కూడా తన ముక్కుకు సర్జరీ చేయించుకుంది. అక్కినేని వారసుడు నాగచైతన్య తొలి సినిమా జోష్‌తోనే కార్తీక కూడా సినిమాల్లోకి వచ్చింది. కానీ అప్పుడు ఈమెపై పలు విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో అందంగా కనిపించేందుకు ముక్కుకు సర్జరీ చేయించుకుంది.
మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచి సినిమాల్లోకి వచ్చిన ప్రియాంక చోప్రా కూడా ప్లాస్టిక్ సర్జరీతో అందంగా మారింది. ముక్కుకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది.
బాలీవుడ్ నటి అనుష్క శర్మ కాస్మెటిక్ సర్జరీ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. లిప్ సర్జరీ తర్వాత ఆమె మొహంలో చాలా మార్పులు వచ్చాయి.
శిల్పాశెట్టి యంగ్‌గా ఉన్నప్పటి ఫొటోలకు.. తర్వాత ఫొటోలను చూడండి.. వాటిలో చాలా తేడా గమనించవచ్చు. ఎందుకంటే ఆమె కాస్మెటిక్ సర్జరీ చేయించుకుని తన ముక్కు ఆకారాన్ని మార్చుకుంది. దీంతో ఆమె మొహం చాలా మారిపోయింది. మరింత అందంగా తయారైంది.
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా సినిమాల్లోకి వచ్చే ముందు పెదాలకు సర్జరీ చేయించుకుంది.
సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయేషా టాకియా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. కానీ ఇది బెడిసి కొట్టడంతో ఆమె మొహం చాలా మారిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Dil Raju | సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దు: దిల్ రాజు
ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
‘మా’ రాజకీయ వేదిక కాదు.. ప్రకాశ్ రాజ్‌పై నరేశ్ ఫైర్
తగ్గేదే లే.. క్యూట్ లుక్స్‌తో కేక పెట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ 5 తెలుగులో తొలిసారి అబ్బాయి ఎలిమినేట్ కాబోతున్నాడా..?
మోహన్ బాబును దొంగ నా కొడుకు అని తిట్టిన స్టార్ హీరో ఎవరు..?