Maa Elections | ‘మా’ రాజకీయ వేదిక కాదు.. ప్రకాశ్ రాజ్‌పై నరేశ్ ఫైర్
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు (Maa Elections) దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. మా రాజకీయ వేదిక కాదు..పదవీ వ్యామోహం సరైంది కాదని మా మాజీ అధ్యక్షుడు నరేశ్ (Naresh) తనదైన శైలిలో చురకలంటించారు.

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు (Maa Elections) దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. మా రాజకీయ వేదిక కాదు..పదవీ వ్యామోహం సరైంది కాదని మా మాజీ అధ్యక్షుడు నరేశ్ (Naresh) తనదైన శైలిలో చురకలంటించారు. ఇవాళ నరేశ్ మీడియాతో మాట్లాడుతూ..కరోనా సమయంలో పరిశ్రమలో రెండు వర్గాలు తయారయ్యాయి. కరోనా వేళ ఒక గ్రూపు నిందించే ప్రయత్నం చేసింది. కరోనా సమయంలో భవనం కంటే ప్రాణాలకు ప్రాధాన్యత ఇచ్చాం. వీలైనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. కొన్ని పనులు చేశాం..ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. చిరంజీవి మా సేవలను అభినందిస్తూ లేఖ రాశారని పేర్కొన్నారు. అన్నింటికి మా ఎన్నికలే సరైన సమాధానం. మంచి వారసుడిని ఇచ్చి వెళ్లడం నా బాధ్యత అని నరేశ్ అన్నారు. ఈ సారి మా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న మంచు విష్ణు ప్యానెల్ కు మద్దతు తెలుపుతున్నట్టు మరోసారి ప్రకటించారు. ఈ సందర్భంగా విష్ణు (Manchu Vishnu) ప్యానెల్ సభ్యులను పరిచయం చేశారు నరేశ్.
ఇక్కడ సరైనోళ్లు లేరని చెప్పడం చాలా సీరియస్ అంశం..
సినీ నటులకు ఒక స్థానమంటూ లేదు. కానీ సరైన వాళ్లు లేరు కాబట్టి తాను ఇక్కడికి వచ్చానని ప్రకాశ్ రాజ్(Prakash Raj) చెప్పడంలో అర్థమేంటని నరేశ్ ప్రశ్నించారు. అంటే తెలుగు వాళ్లలో ఎవరూ లేరా..? కోటి రతనాల వీణ తెలంగాణ..అందరి బంధువు ఆంధ్ర..రత్నాల సీమ రాయలసీమ..మూడు ప్రాంతాల నుంచి తెలుగు వాళ్లు ఎవరూ లేరా అన్నారు. స్వర్గీయులు ఎన్టీఆర్ రామారావు రక్తం మనలో లేదా..? కాపు సింహం రఘుపతి వెంకయ్యనాయుడు తెలుగు సినిమా పితామహుడు..ఆయన రక్తంలో మనలో లేదా. ..? టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు ఆయన రక్తం మనలో లేదా..నాకు ఆసక్తి ఉందని చెప్పండి కానీ ఇక్కడ సరైనోళ్లు లేరని చెప్పడం చాలా సీరియస్ అంశమని నరేశ్ అన్నారు.
మద్రాస్‌లో నాలుగు సినీపరిశ్రమలు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ ఉన్నపుడు తాను చెడ్డీ వేసుకుని తిరుగుతుంటే మనకంటూ తెలుగు వాళ్లకు ఒక అసోసియేషన్ ఉండాలని తెలుగు సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మద్రాసులోని మా ఇంట్లో ఏర్పడిందని గర్వంగా చెప్తున్నానని నరేశ్ చెప్పుకొచ్చారు.
అక్టోబర్ 10న మా ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ కొనసాగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరపనున్నారు. రాత్రి 7 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | క్రేజీ వార్త..చిరంజీవి సినిమాలో రవితేజ..?
Genelia: జెనీలియాని వల్గర్ ఆంటీ అంటూ ట్రోల్స్.. ఆమె సమాధానం ఏంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

