బిగ్ బాస్ 5 తెలుగులో తొలిసారి అబ్బాయి ఎలిమినేట్ కాబోతున్నాడా..?

Bigg boss 5 telugu season | తెలుగులో బిగ్ బాస్ మొదలై ఇప్పటికి నాలుగేళ్లు అయింది. అంటే నాలుగు సీజన్లు ముగిశాయి. ఈ నాలుగు సార్లు అబ్బాయిలే టైటిల్ గెలిచారు. ఒక్కసారి కూడా అమ్మాయిలు టైటిల్ గెలవలేకపోయారు. నాలుగో సీజన్లో అయితే శ్రీముఖి చివరి వరకు పోరాడి రన్నరప్‌గా నిలిచింది. దీంతో ఈసారైనా అమ్మాయిలు టైటిల్ గెలుస్తారా? లేదంటే మరోసారి అబ్బాయిలకే టైటిల్ ఇచ్చేస్తారా అనే వాదన ఎప్పట్నుంచో మొదలైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈసారి కూడా కప్పు అబ్బాయిలకే వెళ్లడం ఖాయమైనట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఐదో సీజన్ మొదలైన తర్వాత ఇప్పటివరకు ముగ్గురు ఎలిమినేట్ అయితే.. వారందరూ అమ్మాయిలే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఒక్క అబ్బాయి కూడా ఎలిమినేట్ కాలేదు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమా దేవి.. మూడో వారం లహరి ఎలిమినేట్ అయ్యారు. దాంతో నాలుగో వారం ఎవరు బయటికి రాబోతున్నారు అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అవుతుంది అనే వాదన మొదలైంది. కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ 5 తెలుగులో తొలిసారి ఒక అబ్బాయి ఎలిమినేట్ కాబోతున్నాడు. ఈసారి అమ్మాయిలు సేఫ్ జోన్లో ఉంటారని తెలుస్తోంది. నాలుగో వారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది ఉన్నారు. అందులో యాంకర్ రవి, సన్నీ, సిరి, కాజల్ లాంటి వాళ్లు సేఫ్ జోన్లోనే ఉన్నారు. అయితే ఓటింగ్ జరుగుతున్న పద్ధతి చూస్తుంటే అనీ మాస్టర్ కాస్త వెనకాల ఉంది. కానీ ఎలిమినేట్ అయితే డేంజర్ జోన్లో మాత్రం లేదు. ఓటింగ్ పర్సంటేజ్‌లో ఈమె కంటే వెనకాల నటరాజ్ మాస్టర్, లోబో ఉన్నారని తెలుస్తోంది. ఆదివారం కచ్చితంగా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటికి రావడం ఖాయం అయిపోయింది. ఈ లెక్కన సీజన్ 5 మొదలైన తర్వాత తొలిసారి ఒక అబ్బాయి ఎలిమినేట్ కాబోతున్నాడన్నమాట. ఓటింగ్ శుక్రవారం రాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. ఆ లోపు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ సారి ఇంటి నుంచి అబ్బాయి బయటికి రావడం దాదాపు ఖాయం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Dil Raju | సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దు: దిల్ రాజు
ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
‘మా’ రాజకీయ వేదిక కాదు.. ప్రకాశ్ రాజ్‌పై నరేశ్ ఫైర్
తగ్గేదే లే.. క్యూట్ లుక్స్‌తో కేక పెట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

